ఓ మేరీ సావన్ - వనజ తాతినేని
రాత్రి ఒక కల కన్నాను
దుర్గమారణ్యంలో పెను తుఫాను.
నన్ను కాచిన గొడుగు
చిరిగి గాలికి తిరగబడి ఎగిరిపోబోతుంది.
వాన భీభత్సానికి అల్లాడిపోతూ
ఎగిరిపోయే గొడుగును శాయశక్తుల బిగించి
పట్టుకుంటూ అసహాయంగా ఏడుస్తూ
అయ్యో! నేనేం చేయను
అంటూ గట్టిగా ఆక్రోశించాను.
ఇదిగో..
నేనిక్కడే వున్నాను అంటూ నాకు గొడుగై నిలిచావు.
పసిపాపను చేసి గుండెకు హత్తుకున్నావు.
జడి వాన శూలాల్లా నిన్ను గుచ్చుతుంది.
ఓ మేరి సావన్!
ప్రేమించడం అంటే యేమిటో ..
నా మిత్రుడిని చూసి నేర్చుకోరాదా!?
27/10/2026. 01:11am.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి