3, అక్టోబర్ 2026, శనివారం

కథగా కల్పనగా

 


Poetic Prose (Epistolary Poetic Dialogue)

కథగా కల్పనగా.. 

చావు లేని జ్ఞాపకాలను 

చావుతో సరిపుచ్చలేను 

అక్షరాల్లో భద్రం చేస్తాను 

ప్రియతమా! 


అప్పుడెప్పుడో .. 

నీకొక మాట చెప్పాను 

గుర్తుందా? 


“మన స్నేహం 

బంధంగా ముడిపడాలంటే 

కొందరి త్యాగాలు మాత్రమే కాదు 

దీవెనలు కూడా లభించాలి.

కన్నీటి నదులపై 

మన జీవిత నౌక సాగకూడదు” అని. 


అప్పుడు 

భారమైన నిట్టూర్పుతో నువ్వన్నావు 

“పన్నీరులా తలపించే 

కన్నీటిలో మునకలు వేస్తుంటాయి 

ప్రేమ పడవలు” 


నిబ్బరాన్ని ప్రోది చేసుకుంటూ

అన్నాను

“పడవలు మునగకుండా 

అరచేతులతో అడ్డుకుందాం

ఏదో ఒక వొడ్డున నిశ్చలంగా

నిలబడి వుంటే చాలు. 

ఏ వొంటరి రేవుతో అయినా 

పడవని ముడిపడనీయ్.”


03/10/2026. 04:13 pm.

కామెంట్‌లు లేవు: