9, అక్టోబర్ 2026, శుక్రవారం

ఉతకని రుమాలు


 ఒక్క గాయం మినహా 


నేనెప్పుడైనా యెవరినైనా  ప్రేమలో 

గాయపరిచానో లేదో తెలియదు


నేనెప్పుడూ ప్రేమలో గాయపడలేదు

ఒక్కసారి మినహా. మరెప్పుడూ గాయపడే 

అవకాశమే ఇవ్వలేదు 


 ఆ గాయాన్ని మాన్పించిన  స్నేహాన్ని ఆ ప్రేమను 

నేనెప్పటికి పోగొట్టుకోలేను

నా ఆఖరి శ్వాస వరకు. 


**********

ఉతకని రుమాలు


నేను రాసేందుకు ఏమీ మిగలలేదు 

ప్రేమ మినహా 


వీలైనంత ఎక్కువగా రాసి నీకు 

కానుకగా ఇచ్చి పోతాను


అసలు ఈ రాసేదంతా నీ కోసమే అని 

నీకు తెలియక పోయినా అది విచిత్రం కాదు 


నీ చెమటతో తడిసిన రుమాలు నా వద్ద 

ఉతకకుండానే బీరువాలో భద్రంగా వుంది


అది యెదపై కప్పుకుంటే చాలు 

నీ ఆత్మీయ పరిష్వంగమే నాకు. 


నా కడపటి యాత్రలో ఆ రుమాలుని

విధిగా కప్పమని రాసి పెడతాను 

బహుశా దాన్ని నువ్వు తప్పక గుర్తు పడతావు. 

ప్రియతమా! 

ప్రేమను కన్నీళ్ళతో వృధా చేయవుకదూ

మాటివ్వు. 





09/10/2026. 08:20 pm.



కామెంట్‌లు లేవు: