చూపున్న పాట -వనజ తాతినేని
కొన్ని పాటలను వొంటరిగా వినాలి
కొన్ని పాటలను జంటగా పాడుకోవాలి
కొన్ని పాటలను సామూహికంగా పాడాలి
కొన్ని పాటలను వేదికలపై ఆర్ద్రంగా విన్నవించాలి
కొన్ని పాటలను చేతన పొందడానికి గర్జించాలి
కొన్ని పాటలను ప్రకృతికి అంకితం చేయాలి
కొన్ని పాటలను నిశ్శబ్దంగా కానుక చేయాలి
పాట లేని ప్రపంచాన్ని ఊహించలేం
పాట తోడు లేని గమ్యాన్ని కలగనలేం
పాటొకటి నేస్తమై నిలిస్తే చాలు నడకంతా పూల బాట
పాటతో నీవు నీతో పాటు పాట.
పాట ఐచ్ఛికం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి