ఆరాధ్యదేవత
నా ప్రేమకు యేదో వొక ఆధారం వుండి వుండాలి
అది నీలోనే యెందుకు దొరకాలి
నీ అంత ప్రేమాస్పదమైన వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు
నువ్వు ప్రేమించావని బదులుగా నిన్ను ప్రేమించలేదు
నాకొకటే చింత; నీలాంటి మనిషి వొకరు తారసిల్లితే
ఈ జీవితం వ్యర్ధం అయ్యేదికాదు
ఇప్పటికి మాత్రం యేమయ్యిందని?
ప్రేమించడానికి ప్రేమింపబడటానికే పుట్టివుంటాం
ఆ సంపూర్ణత నేను అనుభవించాను
అనుక్షణం ఆలోచనతోనూ హృదయం తోనూ
శరీరంతోనూ. ప్రేమించాను
కాలదేవత కరుణించి యిచ్చిన బహుమానం నువ్వు
నా ఆరాధ్య దేవత నువ్వు
ప్రియతామ్ నమామ్యహం
31/10/2026. 03:40pm

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి