భరద్వాజ పిట్ట
వాన తెరిపి ఈయడంలేదు
నీ గురించిన ఆలోచనలు కూడా
సూర్యుడు చంద్రుడు తమ తావుల్లో నుండే
భూమిని వెదుక్కుంటున్నారు
నువ్వూ నన్ను వెతికే పనిలో పడ్డావా?
ఆఖరి ఆకులా ఆశల వృక్షానికి వేలాడుతున్నా
సూర్యుడి దగ్గరకు చేరే భరద్వాజ పిట్టలా
వసంతం కొరకై యెదురుచూస్తాను
నువ్వు వెతకకపోయినా ఫరవాలేదు
నా వెతుకులాటే నిన్ను చేరుతుంది!
03/11/2026.06:20am

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి