3, నవంబర్ 2026, మంగళవారం

అమృతభాండం

 అమృతభాండం


జీవితం యెడా పెడా వాయిస్తుంది

అనేక విధాలుగా.


చేయడానికి యేమీ పని లేనట్లు

అస్తమానం ఈ ఇష్క్ ముచ్చట్లు యేమిటి

పైత్యం కాకపోతే అంది విసుగ్గా ఆమె


జీవితాన్ని రసరంజితం చేసేది ప్రేమ

జీవిత రథచక్రాల ఇరుసుకి కందెన

ప్రేమ

ప్రేమ లేకుండా యెన్ని వున్నా పూజ్యం

తవ్విన కొద్దీ ఊరే చెలమ ప్రేమ అన్నాడు విశ్వాసంగా..


ఆమె తల పంకించింది - కాదనలేక, కాదనాలనిపించక!


వనజ తాతినేని

03/11/2026. 01:20pm.


కామెంట్‌లు లేవు: