నేనొక కథ విన్నాను పిమ్మట
కళ్ళు చెప్పే కథలు
ఆ కళ్ళు చెప్పే అనేక కథలు విన్నాను.
ఒక నిశ్శబ్ద పుస్తకాన్ని విన్నాను
బెరుకు చూపుల కథలు విన్నాను
అపనమ్మకాల నీడల కథలు విన్నాను
కరుకు గాయాల కథలు విన్నాను
కన్నీళ్లు కార్చే బరువైన కథలు విన్నాను
మాటల్లో చెప్పలేని నష్టాలను విన్నాను
తన పక్కనే అండగా నిలబడినప్పుడు
ఆనందం వెల్లువెత్తే కథలు విన్నాను
రాత్రి గుసగుసల కథలు విన్నాను
నేనొక సరికొత్త ప్రపంచాన్ని కనుగొన్నాను
సమయం వెచ్చించి సూక్ష్మం కనిపెట్టాను
నిగూఢమైన లోతుల్లోకి దూకి ఈదులాడి
హృదయానికి దగ్గర దారి కనిపెట్టాను
కళ్ళు చెప్పే కథలు వినడం ద్వారా
తన మనసుని అమితంగాచూరగొన్నాను.
15/11/2026. 03:55 am.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి