5, నవంబర్ 2026, గురువారం

రెప్పపాటు దూరం

 



నిందారోపణ

ఒదిగి వుండాలని

అణిగిమణిగి వుండాలని 

కోరుకునే మనుషుల మధ్య

నా అహాన్ని నేను తప్ప 

మరొకరు భరించలేరు

నువ్వు మాత్రం  నన్ను అవలీలగా 

తలకెత్తుకుంటావ్ 

ఉనికి భద్రంగా వున్నచోటనే

బందీగా వుంటారని

సూక్ష్మం తెలియని లోకం యిది

పైగా నాకు ప్రేమించడం తెలియదని

నిందారోపణ.


04/11/2026. 06:05am

 

*******

రెప్పపాటు దూరం


విశ్రాంత జీవనంలో

మనుషులు 

ఒంటరిగా వుండకూడదు 

అయినవాళ్ళకు 

దగ్గరగా వుండాలి అంటారు. 


నాకు అయినవాళ్ళందరూ 

నిమిషాల వ్యవధిలో వున్నారు 

ఆప్తుడువైన నువ్వు 

రెప్పపాటు దూరంలో వున్నావు. 

ఎంత అదృష్టం నాది!!


04/11/2026. 05:25am

కామెంట్‌లు లేవు: