ప్రేమ బైరాగి
నువ్వు నాకు
వరసకి అన్ని బంధాలూ, బంధుత్వాలూను.
నీలో తల్లి ప్రేమను చూశాను,
సోదరి వాత్సల్యాన్ని చవిచూశాను.
అనేక సందర్భాల్లో గురువుగా నిలిచావు,
శిష్యురాలిగా ఒదిగావు,
స్నేహితురాలిగా తోడున్నావు,
సేవకురాలిగా అలసిపోయావు.
అనేక పర్యాయాలు ప్రేయసిగా ఊరించావు.
విధి చేసిన వింత వల్ల
ఒక్క భార్యగా మాత్రమే మిగలలేదు.
నీతో కలిసి జీవించలేను,
సంపూర్ణ స్త్రీగా నిన్ను చూసిన కళ్ళతో
మరొక స్త్రీని భార్యగా ఊహించలేను
అపరాధ భావనతో మరణించలేను
అందుకే విరాగినయ్యాను
బైరాగిగా సంచరిస్తున్నాను
ఎదురు చూస్తున్నాను
ఏ మలుపులోనైనా యెదురొస్తావేమో అని.
09/11/2026. 08:10pm.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి