29, నవంబర్ 2026, ఆదివారం

కరుణామయి




 ఈ వెలుగు నీడల్లో ఏ మర్మం దాగివుందో

ఈ కాంతిధారలో ఏ చైతన్యం పరిపూర్ణం అవుతుందో

కాలం ఒక మాయాజాలం!


ప్రకృతి, మనుషులు మిగిల్చిపోయిన నొప్పిని

కముకు గాయాల గుర్తులను కాలం

తనలో కలిపేసుకుంటుంది.


బిడ్డలు తప్పు చేస్తే నెపం తనపై వేసుకునే తల్లిలా 

కనుకట్టు విద్య కాలానిది.


గాయం మానినా, మచ్చ మిగిలినా

ఆ మచ్చను కూడా ఒక జ్ఞాపకంగా మార్చి

మనసును ఓదార్చే మమత కాలానిది.


కాలం కరుణామయి. 


కామెంట్‌లు లేవు: