24, నవంబర్ 2026, మంగళవారం

ఉత్తమ స్నేహితుడు



ఉత్తమ స్నేహితుడు 


ఒంటరితనం నా ఉత్తమ స్నేహితుడు

నేను విచారాన్ని లిఖించినప్పుడు

తను స్వరాలు సమకూరుస్తాడు

విందామనుకుంటే..

ఆతడూ కాలం ఒకటే

ఒకే తావున యెన్నడూ నిలబడరు

చెప్పుల్లో కాళ్ళెట్టుకుని తిరుగుతారు

శత్రుసైన్యం ఈ విధంగా 

స్నేహం ముసుగు వేసుకుంటారు కాబోలు. 

అతని తలపుతో మనసు శృతి చేసుకున్నాను

మౌనమే మధుర గానమైంది

సప్తస్వరాల సాగరమైంది.


కామెంట్‌లు లేవు: