కాపలా కుక్క - వనజ తాతినేని
జనులకు మితిమీరిన ఆసక్తి
నీ వివరాలు అడిగారు
నేను అంత తెలివితక్కువ మనిషినా
గోప్యంగానే వుంచాను
నువ్వు చపలచిత్తుడివి అని కాదు
నీపై అపనమ్మకం కాదు
ప్రేమికుడు/ప్రేమికురాలు ని నమ్మి
మోసపోయినవారు వున్నారు
కానీ నాకు ప్రేమపై విశ్వాసం
నీ ప్రేమ నాకు కాపలా కుక్క
అనుక్షణం నన్ను కాచుకునే వుంటుంది
నా అసూయ అభద్రతాభావం గురించే
దిగులంతా; కీడెంచి మేలెంచు తత్వం
నేను మాములు మనిషిని మిత్రమా!
09/11/2026. 08:03 am

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి