నాలో నాలుగు గదులు - వనజ తాతినేని
నెమరువేసే జంతువుకు
కడుపులో నాలుగు గదులు ఉన్నట్టు,
మనిషి గుండెలో
నాలుగు గదులు ఉన్నట్టు,
నాలోనూ నాలుగు భాగాలు.
ఒక గదిలో -
పూలలోని సున్నితత్వాన్ని,
పసిపాప మనస్తత్వాన్ని
ఎల్లప్పుడూ కాపాడుకుంటాను.
రెండో గదిలో -
కుటుంబానికే అత్యంత ప్రాధాన్యతనిస్తూ
బతకడానికి ఇష్టపడతాను.
మూడో గదిలో -
రచయితగా సామాజిక బాధ్యతను
నెత్తికెత్తుకుంటాను.
నాలుగో గదిలో -
అన్నింటికన్నా మిన్నగా,
నీ ప్రేమ సాఫల్యంలో
దినదినాభివృద్ధి సాధిస్తాను.
10/11/2026. 04:55 am.
#వనజతాతినేని #vanajatatineni #హృదయకవితలు #నాలోనాలుగుగదులు #indianpoetrycommunity #మమేకం
---

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి