కాకి ఎంగిలి
నా యీ ప్రపంచానికి
నీ భావనలతో పనిలేదు
వెదురులన్నీ వేణువులు కాలేవు
నీడలన్నీ నిజమైన తోడూ కాదు
మూసిన తలుపులు యెన్నడూ తెరుచుకోవు
కాకి ఎంగిలికి పనికిరాని పదార్థం ఒకటి వుందోయ్, అది నా మనసు
ఎప్పుడైనా సాలభంజికలు చెప్పే కథలు విన్నావా?
ఆకాశం తన రెక్కలు చాపి
తెలి మేఘాలను హత్తుకోదని
పుష్పక విమానంలో
ఎవరికిబడితే వారికి చోటు వుండదని.
25/11/2026. 05:50 am
#వనజతాతినేని
#vanajatatineni
#indianpoetry
#hilights
#follower
#హృదయకవితలు
#మమేకం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి