9, నవంబర్ 2026, సోమవారం

అలంకారం

 అలంకారం

 

నన్ను నేనూ నిన్ను కూడా గొప్పగా చిత్రించుకున్నాను 

ఆ చిత్రపటంపై కొన్ని పువ్వులను ఆశల విహంగాలను ఎగరేసాను

పువ్వులు ఆకురాలు కాలానికి రాలి  చెల్లాచెదురు అయిపోయాయి 

పక్షులు వలస పోయి తిరిగి రాలేదు

చిత్రం ఒంటరిగా అలంకారంగా మిగిలిపోయింది.  

జీవితంలో శూన్యాన్ని వేణువు పాట పూరిస్తూంది.

పాట అలంకారంగా మిగలకుండా ప్రాణం పోస్తోంది. 


08/11/2026. 09:20pm


కామెంట్‌లు లేవు: