నీ పేరు ప్రేమ
నువ్వు కథ కల్పన ఊహ భ్రాంతి కానే కాదు.
నా ఆలోచనల్ని అనుభూతుల్నీ అనుభవాలను
నీ రూపంలోకి మార్చుకున్నాను
నీపై నాకున్న ప్రేమ నాపై నీవు వెల్లడించే ప్రేమ
బహిరంగ రహస్యం
నువ్వు యెవరు అన్నది నిగూఢ రహస్యం
ఎంతోమంది ఆసక్తి చూపారు నీ పేరు తెలియజేయమని.
నీ పేరు ప్రేమ అన్నాను
చికాకుగా అప్రసన్నంగా చూసారు.
నువ్వే చెప్పు!? నువ్వెవరో లోకానికి
విదితం కావాల్సిన అవసరమేముంది.
ప్రేమ అనే దివ్య ఔషధం లేకుండా
యెవరు జీవించగలరు?
బహుశా నా మరణానంతరం నీ పేరు వెల్లడి కావచ్చు
నా అముద్రిత కవిత్వంలో నీ పేరు
పదే పదే ప్రస్తావించబడింది
అలాంటి విషాద సమయాలు
మనుష్యుల హృదయాన్ని వున్నతం చేస్తాయి.
అప్పుడెవరూ మనిద్దరి గురించి
చెవులు కొరుక్కోరు అని నా ఆలోచన.
08/11/2026.12:45pm.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి