3, నవంబర్ 2026, మంగళవారం

ఆక్రమణ

 


ఆక్రమణ


నువ్వో సగం నేనో సగం

వెలుగు నీడ


అద్దంలో చూసుకుంటే

అక్కడ కూడా నువ్వే


ముందేమో చొరబాటుదారుడివి

ఏమోలే అని ఉపేక్షిస్తే

ఆక్రమణదారుడివి అయిపోయావ్


నన్ను నాకిచ్చేయమని అడగనులే

ఆ భారం నేను మోయలేను


నేను దాపటి ఎద్దును కాను

గోవర్ధన గిరిధారి ని కాను.


వనజ తాతినేని

03/11/2026.06:05pm. 

కామెంట్‌లు లేవు: