నువ్వు ప్రేమించే ప్రతిదీ…
జీవితం అంటే ఏంటో చెప్పే
Franz kafka and the Doll story
” నువ్వు ప్రేమించే ప్రతిదీ ఏదోరకంగా కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉంది, కానీ చివరిలో ఆ ప్రేమ వేరే రూపంలో తిరిగొస్తుంది”.
ఫ్రాంజ్ కాఫ్కా అనే వ్యక్తి బెర్లిన్ లో ఒక పార్క్ లో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అక్కడ అతను ఒక చిన్న పాప ఏడుస్తూ ఉండటం చూశాడు. వెంటనే కాఫ్కా ఆ చిన్నపిల్ల దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పాప తన బొమ్మ (Doll) పోయింది అదంటే తనకు చాలా ఇష్టం అని చెప్పింది.
అప్పుడు కాఫ్కా “సరే పదా వెతుకుదాం” అని ఆ పాపతో కలిసి పార్క్ మొత్తం వెతుకుతారు, కానీ ఆ బొమ్మ ఎక్కడా కనిపించదు. అప్పుడు కాఫ్కా ఆ పాపను “సరే రేపు మళ్ళీ పార్క్ లో వేతుకుదాం” అని ఇంటికి వెళ్ళమంటాడు.
కాని పక్క రోజు కూడా ఆ బొమ్మ ఎక్కడా కనిపించదు. అప్పుడు కాఫ్కా ఆ పాపకు తన బొమ్మ రాసింది అంటూ ఒక ఉత్తరం చదివి వినిపించాడు. ఆ ఉత్తరంలో “ఏడవకు నేను ఈ ప్రపంచం అంతా తిరగడానికి బయటకు వచ్చాను, నా ప్రయాణంలో చేసే సాహసాలన్ని నీకు ఉత్తరంలో రాస్తాను” అని ఉంది.
అలా చాలా కాలం పాటు ఆ బొమ్మ రాసింది అంటూ రోజూ ఉత్తరాలను కాఫ్కా చదివి ఆ పాపకు వినిపించేవాడు. ఆ పాప తన బొమ్మ రాసిన సాహసగాధలను విని చాలా సంతోషించేది.
అలా కొన్నాళ్ళకు కాఫ్కా తన బొమ్మ ప్రపంచమంతా తిరిగి మళ్ళీ బెర్లిన్ కు వచ్చేసింది అని ఒక బొమ్మను తేచ్చి ఆ పాపకు ఇస్తాడు. అప్పుడు ఆ పాప ఈ బొమ్మ చూడటానికి నాది లాగా లేదే అని అంది.
అప్పుడు కాఫ్కా చివరిగా రాసిన ఒక ఉత్తరం ఇచ్చాడు. అందులో నేను చేసిన ప్రయాణాలు నన్ను మార్చేశాయి అని ఉంది అని చదివాడు, అప్పుడు ఆ పాప ఆ కొత్త బొమ్మను తన ఎదకు హత్తుకుంది. చాలా సంతషంగా ఆ బొమ్మను ఇంటికి తీసుకెళ్ళింది. ఒక సంవత్సరం తర్వాత కాఫ్కా చనిపోయాడు.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, ఆ పాపకూడా పెద్దది అయిపోయింది, అప్పుడు తను ఆ బొమ్మ లోపల కాఫ్కా సైన్ చేసిన ఒక చిన్న ఉత్తరాన్ని చూసింది. అందులో ఇలా రాసుంది.
” నువ్వు ప్రేమించే ప్రతిదీ ఏదోరకంగా కోల్పోవడానికి ఎక్కువ అవకాశం ఉంది, కానీ చివరిలో ఆ ప్రేమ వేరే రూపంలో తిరిగొస్తుంది”.
****************

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి