వెలిసిపోని రంగు - వనజ తాతినేని
ఆకాశం రంగులు మారుస్తుంది
బుతువులు రంగులు మారుస్తాయి
కాలిబాటలన్నీ పూల రంగులు మార్చినట్లు
వీధులన్నీ శబ్ధాల రంగులు మార్చుతాయి
మనిషి ఆశలన్నీ వెలిసిపోయి
రంగులు మార్చుకుంటాయి
సత్యం బోధపడినప్పుడు మనుషులు కూడా
రంగులు మారుస్తారు
నా రంగు రూపురేఖలు కూడా
రంగు మార్చుకున్నాయి
కొన్ని రంగులు యెప్పటికి వెలిసిపోవు
అదేమిటంటే..
దశాబ్దాలుగా వీసమెత్తు రంగు కూడా
మార్చుకోనిది నీ ప్రేమ వొక్కటే!
12/11/2026. 05:37am

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి