“The Mother” Korean web series లో ఆఖరి భాగంలో వినిపించిన కవిత పరిచయం ఇది.
“మనం రాసిన అక్షరాలు ఎవరికో ఎప్పుడో ఎందుకో తారసపడతాయి. ఎక్కడో ఒక చోట తిరిగి మొలకెత్తుతాయి.” ఇది సత్యం.
“గాయపడ్డాకే జీవితం జీవించడం కోసం మొలకెత్తుతాం. కోల్పోయాకే తెలుస్తుంది, మనలో ఏం బతికుందో!” ఇది నిజం.
'The Mother' సిరీస్ చివరి ఎపిసోడ్ 16 లో అమ్మమ్మ యంగ్-సిన్ చనిపోయాక, హే-నా (యూన్ బుక్) ఒంటరిగా ఆ పెరటి తోటలో నిలబడుతుంది. ఆ తోటని, ఎండిపోయిన పూలని, ఖాళీ కుర్చీని చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కవిత వినిపిస్తుంది.
అది కిమ్ కి-టాక్ (Kim Ki-taek) కొరియన్ కవి రాసిన కవిత.
పేరు: పువ్వు / The Flower
ఆ సీన్‌లో ఒక నెరేటర్ గొంతుతో ఈ కవిత వినిపిస్తుంది. 'అమ్మ వెళ్ళిపోయింది, కానీ ఆమె నాటిన పువ్వు ఇంకా ఇక్కడే ఉంది' అనే అర్థంతో.
---
కవిత: పువ్వు / The Flower by Kim Ki-taek
English Translation
You planted a flower before you left.
You said, Water it every day,
And it will not forget me.
So I watered it every day.
On rainy days, on snowy days,
On days when I was too sad to get out of bed.
I crawled to the garden and watered it.
But the flower withered.
Its petals fell one by one,
Like the days falling off a calendar after you left.
I was angry at the flower.
You promised you would not forget her.
Why did you die?
Today, I went to the garden to pull out the dead stem.
And I saw it.
A tiny green shoot,
Pushing up from the earth beside the old root.
The flower did not die.
It only returned to the earth,
To become a seed again.
To be born again next spring.
You did not leave me.
You only hid in the earth,
Waiting for the right season to return to me.
I will wait. I will water the earth.
I will not forget you.
---
తెలుగు అనువాదం: 'పువ్వు'
వెళ్ళిపోయే ముందు నువ్వు ఒక పువ్వు మొక్క నాటావు
ప్రతిరోజూ నీళ్లు పోయ్యి అన్నావు,
అది నన్ను మర్చిపోదు.
అందుకే నేను ప్రతిరోజూ నీళ్లు పోశాను.
వాన రోజుల్లో, మంచు రోజుల్లో,
దుఃఖంతో మంచం దిగలేని రోజుల్లో కూడా
పాక్కుంటూ తోటలోకి వెళ్లి నీళ్లు పోశాను.
కానీ ఆ పువ్వు వాడిపోయింది.
దాని రేకులు ఒక్కొక్కటిగా రాలిపోయాయి,
నువ్వు వెళ్ళిపోయాక క్యాలెండర్‌లో రోజులు రాలినట్టు.
ఆ పువ్వు మీద నాకు కోపం వచ్చింది
నువ్వు ఆమెను మర్చిపోనని మాట ఇచ్చావు.
మరి ఎందుకు చనిపోయావు?
ఈరోజు, ఎండిపోయిన ఆ కాడను పీకేద్దామని తోటలోకి వెళ్ళాను.
అప్పుడు చూశాను.
ఒక చిన్న ఆకుపచ్చని మొలక,
పాత వేరు పక్కనే, మట్టిని చీల్చుకుని పైకి వస్తోంది.
పువ్వు చనిపోలేదు.
అది కేవలం మట్టిలోకి తిరిగి వెళ్ళింది,
మళ్ళీ విత్తనంగా మారడానికి.
వచ్చే వసంతంలో మళ్ళీ పుట్టడానికి.
నువ్వు నన్ను వదిలి వెళ్ళలేదు.
నువ్వు కేవలం మట్టిలో దాక్కున్నావు,
నా దగ్గరికి తిరిగి రావడానికి సరైన కాలం కోసం ఎదురుచూస్తూ.
నేను వేచి ఉంటాను. నేను మట్టికి నీళ్లు పోస్తాను.
నేను నిన్ను మర్చిపోను.
---
యంగ్-సిన్ చనిపోయింది.హే-నా (యూన్ బుక్) . ఆ తోట, ఆ ఖాళీ ఇల్లు - అన్నింటిని చూస్తుంటే అమ్మమ్మను గుర్తుచేస్తాయి.
కానీ ఈ కవిత చెప్పేది ఏంటంటే… 'చావు అనేది ముగింపు కాదు' అమ్మమ్మ నాటిన ప్రేమ, ఆమ్మమ్మ నేర్పిన ధైర్యం - అవి 'విత్తనం' లాగా హే-నా గుండెలో ఉన్నాయి.
ఒకరోజు ఆ విత్తనం మళ్ళీ మొలకెత్తుతుంది. అమ్మమ్మ మళ్ళీ బతుకుతుంది - హే-నా రూపంలో.
ఎండిన కాడ పక్కన మొలిచే చిన్న మొలక - అదే హే-నా.
అమ్మమ్మ పోయినా, ఆమె పెంచిన మనవరాలు ఇంకా బతికే ఉంది. ఆమెలో అమ్మమ్మ పోలికలు, అమ్మమ్మ ప్రేమ బతికే ఉన్నాయి.
కవి కిమ్ కి-టాక్ “పువ్వు” కవిత కూడా చనిపోలేదు, విత్తనమై మట్టిలో దాక్కుంది' .
'వచ్చే వసంతం కోసం వేచి ఉంటాను' అన్నాడు. అలాగే ఈ తెలుగు నేలలో వికసించాడు కవి.
“మనం రాసిన అక్షరాలు ఎవరికో ఎప్పుడో ఎక్కడో ఒక చోట తిరిగి మొలకెత్తుతాయి.”ఇది సత్యం.
“గాయపడ్డాకే జీవితం జీవించడం కోసం మొలకెత్తుతాం. కోల్పోయాకే తెలుస్తుంది, మనలో ఏం బతికుందో” ఇది నిజం.
కవి కవిత ఇచ్చి వెళ్ళాడు.
యంగ్-సిన్ హే-నాకు ఒక తోట ఇచ్చి వెళ్ళింది.
రెండూ వారసత్వాలే! రెండూ ప్రేమ చిహ్నాలే!
చదివినందుకు ధన్యవాదాలు 🙏
నేనింతే! 😊విపరీతంగా నచ్చితే వాటిని ఒదలను. లోతులకు వెళ్ళి మరీ చూస్తాను. ఈ కవిత అలాగే పరిచయం అయ్యింది. మీకు పరిచయం చేసాను. ఈ సిరీస్ లో మరో రెండు కవితలు వుంటాయి. వీలు వెంటబడి పరిచయం చేస్తాను.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి