కవిత/రచన అద్దం లాంటిది. కానీ ఆ అద్దంలో ఎప్పుడూ కవి/రచయిత మొహమే కనిపించాలని లేదు.
ఒక్కోసారి సమాజం కనిపిస్తుంది. ఒక్కోసారి కాలం కనిపిస్తుంది.
ఒక్కోసారి కవి/రచయిత ఊహించిన ఒక పాత్ర కనిపిస్తుంది.
"ఇంత బాగా ఎలా రాసావు?" అని అడిగితే…
కవి/రచయిత నవ్వి ఊరుకుంటాడు. ఎందుకంటే…
- అది స్వీయానుభవం అయితే- గాయాన్ని మళ్ళీ తవ్వాలని ఉండదు.
- ఇతరుల బాధ అయితే- వాళ్ళ గోప్యతని కాపాడాలి.
- పూర్తిగా కల్పన అయితే - "అబ్బే, ఊరికే రాశాను" అనడం కవికి ఇష్టం వుండదు.
మానవ స్వభావం అంటే ఇదే!
అందరూ అన్నీ పంచుకోరు. పంచుకోవాల్సిన అవసరం లేదు.
కొన్ని గాయాలు మాటల్లోకి వస్తే కవిత అవుతాయి.
కానీ ఆ గాయం ఎవరిది అని అడగకూడదు.
కవి/రచయిత కెమెరా లాంటివాడు. ఒక్కోసారి తనని తాను సెల్ఫీ తీసుకుని చూపుతాడు. గ్రూప్ సెల్ఫీ కూడా కావచ్చు.
ఒక్కోసారి లోకాన్ని ఫోటోలు తీస్తాడు.
ఒక్కోసారి ఊహల్ని సెట్టింగ్స్ వేసి చిత్రాలు తీస్తాడు.
మూడు చిత్రాలు కవి తీసినవే, కానీ మూడింట్లో అతను ఉండవచ్చు ఉండకపోవచ్చు. అలాగే ప్రతిది కవి/రచయిత కథ/ కవిత కాదు.
సంవత్సరాల తరబడి చదువుతున్న పాఠకులు కూడా పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. Update కావాలి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి