14, జులై 2026, మంగళవారం

ఆత్మశోధన తర్వాత పూజ




ఆత్మ శోధన తర్వాత పూజ

దేవుని పాదారవిందాలను పూలతో అలంకరించడానికి గుడి కి వెళ్లద్దు 
ముందుగా నువ్వుంటున్న జాగాని ప్రేమ మరియు దయ అని సువాసనలతో అలంకరించు.

దేవుని మందిరం ముందు దీప కాంతులు నింపడానికి  గుడికి వెళ్లద్దు 
క్రోదం, అహము ఇంకా  గర్వమనే చీకట్లను పారదోలడానికి 
నీ హృదయాన్ని కాంతివంతం చేయి.

దేవుడి ముందు తలవంచి ప్రార్ధించడానికి ముందు  
తోటి మానవలపట్ల మానవత్వం చూపించడానికి తలవంచు 

దేవుడికి మోకాళ్లపై వంగి ప్రార్ధించడానికి గుడికి వెళ్లేముందు 
బాధాతత్పుడైన మనిషికి సాయంఅందిచడానికి చెయ్యందించు 

నీ పాపాలనుండి విముక్తి ప్రసాదించమని దేవుడిని ప్రార్దించే ముందు 
నువ్వు బాధపెట్టిన మనుషులను క్షమించమని ప్రార్దించు...
#వనజతాతినేని


కామెంట్‌లు లేవు: