16, జులై 2026, గురువారం

పక్వానికి రాని పండు

 పక్వానికి రాని పండు  - వనజ తాతినేని 


నా ప్రేమ నీకు యెన్నడూ భారం కాకూడదు. 

గాలి అలలపై తేలియాడే పాటలా నీతో ప్రవహిస్తూ వుంటాను.. 

వేరొక ప్రేమకై దేవులాడను నేను 

దొరికిన ప్రేమను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటాను

పక్వానికి రాని పండు ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు. 


ప్రయాణాలు వేరయ్యాక వెనుదిరిగి చూసుకుంటే ఏం లాభం? 

పక్కనే  నిరంతరం వెలిగే నక్షత్రాన్ని చూడలేని చత్వారపు పక్షిని నేను 

నేనెప్పుడూ హృదయం తెరిచి చెప్పలేని ప్రేమను,

ఎప్పుడూ నిను  అల్లుకుని వుండే పేరులేని బంధాన్ని, మౌనంలోని సంగీతాన్ని.

వేదనలో ఏకాంత వైణికురాలిని. 


అయితేనేం.. పరిపూర్ణమైన ప్రేమను సేవించి

సంతోషంగా వున్న నేను ఒకప్పుడు బాధలో వున్నప్పటి

నన్ను ని  కౌగిలించుకుంటాను. . 

లెక్క సరిపోతుంది. 


ఫలించని పుష్పించని చెట్లు కూడా 

శిశిరానికి రాలి వసంతానికి చిగిర్చి 

పచ్చదనాన్ని ప్రసాదిస్తాయి చూడు.. 

నేను అలాంటి దేవదారు వృక్ష  ప్రేమని!


The Unripe Fruit

_- Vanaja Tatineni_


My love should never be a burden to you.

I will flow with you like a song drifting on the waves of the wind..

I will not yearn for another love

I will learn how to cherish the love I have found.

I know how hard an unripe fruit can be.


What is the use of looking back after our paths have diverged?

I am the sparrow that failed to see the star shining constantly beside me.

The love I could never speak of with an open heart,

The nameless bond that always entwines you, the music in silence.

I am the lone veena player in sorrow.


So what? Having embraced perfect love and found happiness, 

I will now embrace the version of myself that once knew sorrow.

The accounts are settled.


Even the trees that neither bore fruit nor blossomed,

shed their leaves in winter and sprout anew in spring,

gifting us their greenery, you see..

I am that kind of Deodar tree love!


16 July 2026. 09:30 pm




కామెంట్‌లు లేవు: