6, జులై 2026, సోమవారం

Nature’s Book




Nature’s Book

_By Vanaja Tatineni_


Around me, stars are radiating light in the form of letters.

The thoughts that arise in my mind are spreading the fragrance of wild flowers.

A shy, polite page, blushing, peeks out from behind the clouds like the moon.

My little heart merrily plays in the showers of word-rain, jumping and dancing.

After the rain clears, all the colors of the rainbow have become book-butterflies and are playing in the garden.

A mischievous butterfly landed on my face.

Time, for some reason, came to a standstill.

If we become one with it, isn’t nature a vast library of books?


English Translation: 06 July

2026. 

Original poem in Telugu “Prakriti Pustakam” by Vanaja Tatineni 


********


ప్రకృతి పుస్తకం -వనజ తాతినేని.


నా చుట్టూ నక్షత్రాలు అక్షరాల రూపంలో 

కాంతులు విరజిమ్ముతున్నాయి. 

మదిలో మెదిలే భావాలు అడవిపూల 

సౌంగంధాన్ని వెదజల్లుతున్నాయి. 

పుట తిరగేయని ఓ మొహమాటపు మర్యాద 

సిగ్గుపడుతూ మేఘాల మాటున జాబిలి లా తొంగి చూస్తుంది. 

నా చిన్నారి మనసు తుళ్ళి తుళ్ళీ పదాల 

వాన చినుకుల్లో సంబరంగా ఆడుకుంటుంది

వాన వెలిసాక ఇంద్రధనుస్సు లోని రంగుల్లన్నీ  

పుస్తకాల సీతాకోకచిలుకలై  తోటలో ఆడుకుంటున్నాయి.

ఓ తుంటరి సీతాకోక చిలుక నా ముఖంపై వాలింది. 

కాలమెందుకో స్తంభించిపోయింది.

మమేకమైతే ప్రకృతి ఓ పెద్ద పుస్తక భాండాగారం కదా!


కామెంట్‌లు లేవు: