మైక్రో కథ
పెన్ డౌన్
“కథలు గొప్పా, మనుషులు గొప్పా !? “
అని అడిగాడు అతను .
“కథల్లోను మనుషుల్లోను కనబడే హృదయాలు గొప్ప” అంది ఆమె..
“నా హృదయాన్ని నా ప్రేయసి స్వీకరించడం లేదు. దయచేసి కథలో నా హృదయాన్ని చిత్రించవా!” వేడుకున్నాడు.
“చాలా కథల్లో నీ ప్రేమను హృద్యంగా రాసాను. పాఠకులు గుండెల్లో పెట్టుకున్నారు. నీకు తెలియదులే ఆ విషయం” విసుగు ప్రదర్శించింది.
“స్వీకరించని ప్రేమానుభూతిని నువ్వేం రాయగలవు” అతని ఆక్షేపణ ఆరోపణ.
ఉలిక్కిపడింది. “వాటీజ్ లవ్!?” ప్రశ్నించింది.
“వెయిటింగ్” అన్నాడు ఠక్కున.
ఆమె పెన్ డౌన్ చేసింది.
******************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి