పలకరింపు - వనజ తాతినేని.
ఈ మిట్టమధ్యాహ్నపు ప్రశాంత ఏకాంత సమయంలో..
ఉన్నట్టుండి నీ పై ప్రేమ గంగలా పొంగిపొర్లింది.
నిన్నొకసారి పలకరించాలనే తలంపు చిత్తంలో బలపడింది.
ఎలా వున్నావ్ లాంటి క్షేమసమాచారాలను
మించి నీకూ నాకూ తెలిసిన పలకరింపు ఒకటుంటుంది కదా!
అది కాలాతీత నిశ్శబ్దం నుండి ఉద్భవించిందేమో
అన్నట్టు వుంటుంది కదూ!
నాభి నుండి వెలువడిన ఆ మృదువైన స్వరం
పంట చేనుపై పైరగాలి వీచినట్లు
నీటి అలలపై గాలి మృదువుగా ప్రవహించినట్లు
నైటింగేల్ పక్షి శ్రావ్యంగా పాడినట్లు.
అలౌకికమైన అనుభూతిలో తడిసిపోతాను.
తిరిగి నేనూ అదే ప్రేమతో అదే స్వరంతో పలకరించగలనో లేదో
అని సంశయిస్తూ సిగ్గుపడుతూ మాట రాని మౌనంతో
మిగిలిపోతాను.
నిన్ను పిలవాలనుకున్న ఆ పిలుపు లక్షలసార్లు
నాలోపల ప్రతిధ్వనిస్తూ వుంటుంది మిత్వా!
26 July 2026 01:15 pm.
*English Translation*
*A Greeting*
_- Vanaja Tatineni_
In this tranquil solitude of the mid-afternoon..
Suddenly, my love for you surged and overflowed like the Ganges.
The thought of greeting you once grew stronger in my mind.
Beyond mere "how are you" and pleasantries,
there is a greeting that only you and I know, isn't there!
It feels as if it emerged from timeless silence, doesn't it!
That soft voice that arose from my navel was like
a gentle breeze blowing over a crop field,
like the wind flowing softly over water waves,
like a nightingale singing melodiously.
I get drenched in that transcendental feeling.
And then, doubting and blushing, wondering if I can
greet you back with the same love, with the same voice..
I remain, left with a speechless silence.
The call with which I wanted to call out to you
keeps echoing within me millions of times, Mithva! (My friend)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి