రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వం చదువుతూ వుండగా …ఈ కవిత నన్ను ఆకర్షించింది.
ఈ కవిత రాసినప్పుడు కవి వయస్సు ఎంత వుంటుంది అనే ఆలోచన వచ్చి search చేసాను. ఠాగూర్ తన 36 సంవత్సరాల వయస్సులో ఈ కవిత రాసారు. అదీ ఓ పడవ ప్రయాణంలో.
ఈ పాటను రచిస్తున్నప్పుడు రవీంద్రనాథ్ ఒక జమీందార్‌గా సేవ చేయడానికి నదిని దాటుతూ పడవలో ఉన్నారు.ఈ పాట యొక్క మొదటి రాతప్రతి 'మజుందార్ పుంథి' అనే నోట్‌బుక్‌లో లభించిందట. అందులోని కవిత పేరు 'మానస్-ప్రతిమ' మరియు దాని మొదటి పంక్తి 'తుమీ సోంధ్యార్ మేఘ్ శాంతో సుదూర్'. ఆ రాతప్రతిపై 'చలన్‌బిల్, ఝోర్-బ్రిష్టి' అని లిఖించబడి ఉంది. ఒక సాయంకాలపు ప్రశాంతమైన వర్ణనతో కూడిన ఈ కవితను రాస్తున్నప్పుడు కుండపోత వర్షం కురుస్తోందని ఇది సూచిస్తుంది, అయినప్పటికీ, కవితలో దానికి సంబంధించిన ఎలాంటి సూచనలు లేవు. నిజానికి, దీని స్వభావం ఎంత పొడిగా ఉంటుందంటే, 'హేమంత' రుతువును సూచించడానికి ఒకసారి కవి స్వయంగా కొంతమంది గాయకులను ఈ పాటను పాడమని కోరారు.
ఆ విషయం ఏమిటంటే..ఒకసారి శాంతినికేతన్‌లో మహిళలు ఆరు ఋతువులకు సంబంధించిన పాటలు ప్రదర్శిస్తున్నారట. రవీంద్రనాథ్ మరికొందరు ప్రొఫెసర్లతో కలిసి ఉన్న వేదికపై వారు ఆరు పాటలు పాడాలని అనుకున్నారు..
'హేమంత'కు తగిన పాట వారికి దొరకలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ వారికి సహాయం చేసి, 'తుమీ సంధ్యార్ మేఘోమాల' అనే పాటను సూచించారట. ఠాగూర్ తన పాటలను కవితలుగా ఆంగ్లంలో తనే స్వయంగా రాసారు. అలాగే స్వరలిపి చేసి స్వయంగా పాడేవారట. రవీంద్రుడి సాహిత్యం అంతా.. శాంతినికేతన్ వెబ్ సైట్ లో పదిలపరిచారు. అందుకు ఠాగూర్ ఆఖరి కుమారై,కుమారుడు,సోదరులు ఎంతో శ్రమించి భద్రపరిచారు.
అక్షరజ్ఞానం లేని ఏదో కొద్దిగా చదువుకున్న బెంగాలీ కుట్టుపని కార్మికులు కూడా తాము పదే పదే ఠాగూర్ పాటలు వింటూ నాకు వినడం అలవాటు చేసారు. గీతాంజలి తప్ప ఏమీ తెలియని నాకు అలా ఠాగూర్ సాహితీ సుగంధం నన్ను చుట్టుకుంది.
Rabindranath Tagore wrote and composed the song "Tumi Sondharo Meghomala" (তুমি সন্ধ্যার মেঘমালা) in 1897while on a boat at Chalan Bil. It is a renowned Rabindra Sangeet, categorized under the 'Prem' (love) parjaay.
Written on: 24th September 1897 (9 Ashwin 1304)
Place: Chalanbil
Tumi Sandhyar Meghamala .
You Are A Cluster Of Clouds - Rabindranath Tagore
You are a cluster of clouds of the evening sky
I have sought only you all my life
It is you who fills my empty sky
I have made you with the sweet fancies of my mind
You are mine, you are mine
O you wanderer of my boundless sky.
With the blood of my heart I have beautified your feet
My evening dreams are full of you
I have coloured your lips with poison and honey
Mixing with my joys and sorrows
You are mine, you are mine
You have filled my lonely being.
I have coloured your eyes with collyrium
Made of the fancies of my love
You always fill the view of my spellbound eyes
With my music
I have dressed all your limbs
You are mine, you are mine
Both in my life and death you fill my being.
********** తెలుగు స్వేచ్ఛానువాదం.
మేఘాల సమూహానివి నీవు.
సంధ్యా గగనపు మేఘాల సమూహానివి నీవు
నా జీవితమంతా కేవలం నిన్నే వెతికాను
నా శూన్య ఆకాశాన్ని పూరించేది నీవే
నా మనసులోని మధుర కల్పనలతో నిన్ను సృష్టించుకున్నాను
నీవు నాదానివి, నీవు నాదానివి
ఓ నా అంతులేని ఆకాశపు సంచారిణీ!
నా హృదయరక్తాన్ని పారాణి చేసి నీ పాదాలను అలంకరించాను
నా సాయంకాలపు స్వప్నాలన్నీ నీతోనే నిండి ఉన్నాయి
నా సుఖదుఃఖాలను మేళవించి,
నీ పెదవులకు విషం, తేనెల రంగులు అద్దాను
నువ్వు నాదానివి, నువ్వు నాదానివి
నా ఏకాకి అస్తిత్వాన్ని నువ్వు నింపివేశావు.
నీ కళ్ళకు కాటుక అద్దాను అది
నా ప్రేమ కల్పనలతో రూపొందించబడినది
నా మంత్రముగ్ధ నేత్రాలను నువ్వు
ఎల్లప్పుడూ నా సంగీతంతో నింపుతావు.
నేను నీ కాళ్ళు చేతులకు (అవయవాలకు) దుస్తులు తొడిగాను.
నువ్వు నా దానివి, నువ్వు నా దానివి
నా బ్రతుకు, మరణం రెండింటిలోనూ నీవే నా అస్తిత్వాన్ని నింపుతావు.
(జత పరిచిన చిత్రం Pinterest సౌజన్యం తో )

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి