తలుపు చప్పుడు - వనజ తాతినేని.
ఆమె కన్నుల్లో రంగులు విరబూసాయి
పెదవులపై పూలు వికసించాయి
ఊహల్లో గుర్రాలకు రెక్కలొచ్చాయి
హృదయ లయల్లో ఢమరుకం ధ్వనిస్తుంది
మనసు పొరల్లో వేణువు నర్తిస్తుంది
ఆపాదమస్తకం వణికింది అలజడితో
ఎందుకంటే…
ఎవరో తలుపు తట్టారని తెరిచి చూస్తే
ఎన్నటికీ తిరిగి చూడడని అనుకున్న అతను.
*************
"Frankly, my dear, I don't give a damn" అంటూ వెళ్ళిపోయాడు(Rhett Butler) రెట్ బట్లర్
ఏడుస్తూనే ఉక్రోషంతో అనుకుంటుంది..
"After all, tomorrow is another day!" by Scarlett O'Hara. (స్కార్లెట్ )
అకస్మాత్తుగా రెట్ బట్లర్ వచ్చి తలుపు తడితే.. స్కార్లెట్ మానసిక స్థితి యెలా వుంటుందో అని ఊహిస్తూ.. ఈ చిన్న కవిత రాసాను.
The Gone With the Wind నవల లో ముఖ పాత్రలు వీరిరువురూ. ముగింపు అలా వుండకుండా వుంటే బాగుండుననిపిస్తుంది గుర్తుకొచ్చే ప్రతిసారి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి