9, మే 2026, శనివారం

కన్నీటి సృష్టికర్త

 కన్నీటి సృష్టికర్త

ఒకానొక ఊరు. ఆ ఆనందపు గ్రామంలో,

ఎవరూ ఎన్నడూ ఏడవలేదు, వారు ఎంత ప్రయత్నించినా దుఃఖాన్ని  వేదనను అనుభవించలేకపోయారు,

అప్పుడు ఒక తుఫాను రాత్రి.. కన్నీటి సృష్టికర్త ఆ చిన్న ఊరి లో  ప్రవేశించాడు, 

ఉదయాన్నే ఒక ప్రకటన వచ్చింది, సారాంశం ఏమిటంటే.. ఎవరైనా ఏడ్వాలి అనుకుంటే అతని వద్దకు రావచ్చు,


కొందరు అతను ఒక మాంత్రికుడని అన్నారు. మరి కొందరు అతను అతీంద్రియ శక్తులు కలవాడని అన్నారు. కానీ అతను ఎవరో దేవుడికే తెలుసు, అతను మీ భయాలన్నింటినీ శాంతపరుస్తాడు,

అతనికి మీ లోతైన రహస్యాలన్నీ తెలుసు, మీరు యేవేవి  దాస్తారో కూడా అతనికి తెలుసు,


మీ లోతైన కోరికల చిట్టా విప్పి చూపుతాడు, ఆలోచనలు విభజించినట్లుగా అతను మీ మనస్సులను విప్పి మీ అంతరంగాన్ని జయిస్తాడు.

అతను మీలో దాగిన  లోతైన విభేదాలను బయటకు పిలుస్తాడు,

మీకు ఆ విభిన్న భావాల వెచ్చదనాన్ని కూడా అనుభూతి చెందేలా చేస్తాడు,

మీ బుగ్గలపై కారే కన్నీటి వెచ్చదనం ఒక వికారమైన వస్త్రంలో కప్పబడుతుంది,

మీలో శక్తి ఎంత అసంబద్ధమో, ఎంత గాఢమో తెలియజేసి.. ఆపై  మర్మగర్భంగా అదృశ్యమైపోతాడు. ఎవరి చెవులలోనూ ఎలాంటి అసంతృప్తి శబ్దం మిగల్చకుండా..

ప్రపంచంలో శాంతిని కాపాడుతూ. 


*************

అంటాడు కవి. 

కవి పేరు గుర్తు లేదు.  ఎక్కడ చదివానో గుర్తులేదు. ఈ రోజు తవ్వకాల్లో బయటపడింది. 

ఈ కవిత యొక్క సారాంశం ఏమిటంటే.. మీ నిరాశ అసంతృప్తి భరించే అవమానాలు మీకు జరిగిన నష్టాలు.. ఏవైనా మీకు దుఃఖం కలిగించే విషయాలు వున్నట్టు అయితే మనసారా ఏడవండి. ఏడ్వడం బలహీనత కాదు. మనసు తేలికపడుతుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా శుభ్రపడుతుంది. దుఃఖాన్ని లోన దాచుకున్న మనుషులు ఇతరులను ప్రశాంతంగా వుండనివ్వరు. నరకం సృష్టిస్తారు. మన మధ్య కూడా కౌన్సిలింగ్ చేయగల మనుషులు మానసిక వైద్యులు ఉంటారు. వారు కూడా గడ్డ కట్టిన మౌనాలను మంచులా పేరుకుపోయిన దుఃఖాన్ని కరిగించగలరు. వారు కూడా కన్నీటి సృష్టికర్తలే! 

కవిత్వకథనం నచ్చిందా!? ధన్యవాదాలు🙏.




కామెంట్‌లు లేవు: