27, మే 2026, బుధవారం

With the Plough You Abandoned

 



English Translation: With the Plough You Abandoned

మూలం: నువ్వు వదిలేసిన కాడితో  - వనజ తాతినేని.

With the Plough You Abandoned  

Vanaja Tatineni


Like water seeping year after year into the stream-bed,  

our needs kept oozing up.  

The debts we took, along with their interest,  

kept growing season after season—  

like thorny bushes.


To forget all the pain,  

you drank that liquor then…  

and now, you’ve drunk this poison straight,  

and shriveled up like an insect.


From the day my sari-knot was tied to yours…  

Forgetting that I was your support,  

you left me alone—  

a solitary pillar—  

for the ones who birthed you, and the ones we birthed.  

You abandoned me to the wind,  

and merged with the wind yourself.  

Since then, I drink the liquor called ‘courage’ every day.


The hands that never came to help when you were alive  

now crowd before me, countless.  

Around these bodies, starved thin, shriveled to bone…  

hungry gazes circle like crows, like vultures,  

swooping in endlessly.  

The pains I thought would end with your death  

only moved from the frying pan into the fire,  

like the screeching of crickets at midnight.


The torments of the moneylenders, the unending hunger-cries  

of children that twist the guts…  

the swelling of a youth I cannot hide…  

Like water in a dry irrigation well,  

fear, misery, and emptiness  

flicker and float in my desiccated eyes.


For stars to rise in the eyes of our people…  

I must build fences of thorns around the gazes that circle us,  

I must light a fire in my own eyes,  

and stop them an aamadam away.  

With the plough you abandoned,  

I must keep tilling the field of life.  

I must keep living… I must keep living…  

I must keep living… I must keep living,  

with this one hand, until I reach the far shore.


---

మూలం: నువ్వు వదిలేసిన కాడితో. - వనజ తాతినేని

ఆంధ్ర జ్యోతి ఆదివారం ప్రచురణ


అనువాదంపై మాట:  

'కాడి' = 'plough' - నాగలి కాడి. 'చెలమ' = 'stream-bed'. 'రెళ్ళు దుబ్బులు' = 'thorny bushes'. 'మందు' = 'liquor' మొదట, 'poison' రెండోసారి. 'ఒంటి నిట్టాడిని' = 'a solitary pillar' - ఇంటికి ఆసరా. 'కీచురాళ్ళు' = 'crickets'. 'మోటబాయి' = 'irrigation well'. 'ఆమడ' = 'an aamadam' - సుమారు 8 మైళ్ళు, ఇక్కడ 'చాలా దూరం' అని అర్థం. 'ఆవలి ఒడ్డు' = 'the far shore'.


నువ్వు వదిలేసిన కాడితో

ఏ ఏటికి ఆఏడు చెలమలోని  నీళ్ళులాగ
అవసరాలు ఊరుతూనే ఉండాయని
చేసిన అప్పులు వడ్డీతో కలసి
సాలుసాలుకి రెళ్ళు దుబ్బుల్లా
పెరుగుతూనే ఉండాయని
బాధల్లన్ని మరిచిపోవాలని
అప్పుడు ఆ  మందు తాగినావు ..
ఏకంగా  ఇప్పుడు ఈ మందు తాగేసి
పురుగులా మాడిపోయావు.
.
కొంగు ముడి  పడ్డ నాటినుండి ..
నేను సాయంగా ఉండానన్న సంగతి మరిసేసి
నిన్ను కన్నోళ్ళకి   మనం కన్నోళ్ళకి
నన్నే ఒంటి నిట్టాడిని  చేసి పోయినాక
నన్ను గాలికి  ఒగ్గేసి..
నువ్వు గాలిలో కల్సిపోయాక
నేను రోజూ ధైర్యం అనే మందు తాగుతూనే ఉండాను ..

నువ్వు ఉన్నప్పుడు సాయం చేస్తానని రాని చేతులు
నా ముందుకొచ్చాయి  లెక్కలేనన్ని..
బిక్క చచ్చి బక్క చిక్కి ఉన్న శరీరాల చుట్టూ ..
ఆకలి చూపులు కాకుల్లా.. గ్రద్ధల్లా..
గిరికీలు కొడుతూనే ఉండాయి.
నువ్వు చస్తే మారతాయని  అనుకున్నబాధలు
పెనంలోనుండి పొయ్యిలోకి మారినాయి.

నడిరేతిరి కీచురాళ్ళ రొదలా..
అప్పులాళ్ళ బాధలు,పేగులు తిప్పేసే బిడ్డల
 తీరని ఆకలి కేకలు..
దాయలేని యవ్వనపు ప్రాయపు పొంగులు..
మోటబాయి లోని నీళ్ళు లాగానే
నీరింకిన కళ్ళల్లో భయం, దైన్యం
శూన్యం తారట్లాడుతున్నాయి.

మనోల్ల చూపుల్లో చుక్కలు పొడవాలంటే ..
మా చుట్టూ తిరిగే చూపులకి ముళ్ళ కంచెలు కొట్టి
మా చూపులకి అగ్గి రగిలించుకుని..
ఆమడ దూరంలో వాళ్ళని ఆపేసి
నువ్వు వదిలేసిన కాడితో ..
బతుకు సేద్యం చేస్తూనే ఉండాల.
బతుకుతూనే ఉండాల.. బతుకుతూనే ఉండాల
ఒంటి చేత్తో ఆవలి ఒడ్డుకి చేరేదాక..
బతుకుతూనే ఉండాల. బతుకుతూనే  ఉండాల.. 





కామెంట్‌లు లేవు: