సముద్రంలో సీసా - వనజ తాతినేని
తిరస్కరణను అవమానాన్ని
ఓ గాజు సీసాలో భద్రపరిచి
సముద్రంలో విసిరి పడేశావు
ఏ తీరంలోనో అది దొరికిన వారు
మురిసిపోయారు కానుక దొరికిందని.
నువ్వు అందులో వుంచింది
నువ్వు పొందినవాటిని కూర్చి
అందమైన కవితలు అల్లావు
వాటి సౌందర్యం సువాసన
కాలానికి ఎదురీది పరిఢవిల్లాయి
ఎందుకంటే.. ప్రేమ ఉచితానుచిత
జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది గనుక.
21 May 2026. 06:30 am.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి