చరమ శ్లోకం
సున్నితమైన నీ దోసిలి లో గులాబీ పువ్వులా
ఊయలలూగుతుంది నా మనసు.
అలసిన హృదయం సేదతీరుతుంది నీ జోలతో.
మహా యోగిని నేను. ఇది చాలును.
చరమ శ్లోకం రాసి పెట్టుకున్నాను.
నిత్యం వికసించే పూల మొక్కలై నా చుట్టూరా
నువ్వే వుండాలి. నేను జవజీవమై ..
నిన్ను సదా సంరక్షించుకుంటాను.
ప్రియతమా!
ఇంతకన్నా హృదయార్పణం ఇంకేముంటుంది.
(చరమ శ్లోకం (Here lies) సమాధి పై వ్రాసే వాక్యం)
30 May 2026.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి