31, మే 2026, ఆదివారం

The Address

 English Translation: The Address


The Address  

Vanaja Tatineni,


On a road that never changes,  

the travelers who change—  

so many, so many…


How many turns have their lives taken!?  

How many garlands of clouds have come,  

touched the steadfast mountain peak,  

and left after pouring torrential rain?


How many stood before the still mirror,  

saw themselves, and left?  

How many inner selves were laid bare?


Into the sea that never changes its nature with the turmoil,  

how many rivers have merged…  

How many river-hearts have yearned  

to become that union with the ocean…


In this endless stream of life,  

as long as we cannot love a human as a human…  

coming with some expectation, leaving after slinging mud—  

all of it… is routine!


For the wounds made by selfishness,  

what we need is not a superficial ointment…  

But a trustworthy companion  

who stays with you for a lifetime and guides you.


For loneliness, for solitary journeys,  

to not slip away somewhere, someday…  

how much strength of mind is needed?  

How much ‘ego’ must one be seen to have?  

Otherwise, a smiling face  

will bow down in humiliation.


My dear friends,  

Age, fame—like a moth—  

ends in a moment, doesn't it?  

It teases, seeming to be there and not there,  

attainable and unattainable,  

flaunting its cleverness…


Did I bear the weight of your thoughts,  

or did I increase the lifespan of your feelings?  

Did I tolerate your envy and hatred,  

or did I endure the turmoil of your hearts…


Whatever you may think, I am—  

a pleasant wave,  

a trustworthy friendship…  

The address to a heart  

that loves you as you are.


Translate: 30 May 2026.

మూలం: చిరునామా  - వనజ తాతినేని.

©️copyright reserved -Vanaja Tatineni 


చిరునామా - వనజ తాతినేని.

                                                                

ఎన్నటికి మారని రహదారిపై

మారుతున్న ప్రయాణికులు

ఎందరెందరో..


జీవితాలు ఎన్ని మలుపులు తిరిగాయో!?

స్థిరంగా నిలబడిన పర్వత శిఖరాన్ని

తాకి తాకి వెళ్ళే మేఘమాలికలు ఎన్నెన్నో

ఎంత కుంభ వృష్టిని కురిపించి వెళ్ళాయో


నిశ్చలంగా నిలబడిన అద్దం ముందు

తమని తాము దర్శించుకుని వెళ్ళింది ఎందరో

ఎన్ని అంతఃస్వరూపాలు బహిర్గతం కాబడ్డాయో


అలజడితో స్వభావాన్ని మార్చుకోని సముద్రంలో

ఎన్ని నదులు సంగమం చెందాయో..

ఆ సాగర సంగమం గా మారాలని

ఎన్ని నదీ హృదయాలు పరితపించాయో..


అనంత జీవన ప్రవాహంలో 

మనిషిని మనిషిగా ప్రేమించుకోలేనంత కాలం ..

ఏదో ఆశించి రావడాలు, బురద చల్లి పోవడాలు 

అంతా..మామూలే!


స్వార్ధం చేసిన గాయాలకి

పై పై లేపనాలపూత కాదు కావాల్సింది..

జీవనపర్యంతం వెంట ఉండి

నడిపించే నమ్మకమైన తోడు


ఒంటరితనాలు , ఒంటరిపయనాలు

ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట

జారిపోకుండా ఉండటానికి

ఎంత దృఢచిత్తం కావాలి

ఎంతటి అహం ఉంది అనిపించుకోవాలి

లేకుంటే నగుమోము

నగుబాటుతో తలదించుకోదూ


నా ప్రియ నేస్తాల్లారా 

వయస్సు,యశస్సు శలభంలా 

ఘడియలో ముగిసిపోదూ

ఉండిలేనట్లు అందీ అందనట్లు

భ్రమింపజేస్తూ నెరజాణతనం ప్రదర్శిస్తూ..


మీ ఆలోచనల భారం మోసానో 

మీ అనుభూతుల ఆయుష్షుని పెంచానో

మీ మీ..ఈర్ష్యద్వేషాన్ని సహించానో

మీ మీ హృదయాల అలజడిని భరించానో..


మీరేమనుకున్నా నేను మాత్రం 

ఒక ఆహ్లాద కెరటాన్ని

ఒక విశ్వసనీయ స్నేహాన్ని..

మిమ్మల్ని మీరుగా ప్రేమించే 

హృదయానికి  చిరునామాని


 - వనజ తాతినేని 15/04/2013.


కామెంట్‌లు లేవు: