13, మే 2026, బుధవారం

ప్రేమిస్తూనే వుంటాను..

 ప్రేమిస్తూనే వుంటాను..  


గోడలెన్ని కట్టుకున్నా  

వరుస కంచెలు నిర్మించుకున్నా

పరిమితులు నిర్ణయించినా  

షరతులు విధించినా 

ఇప్పుడూ యెప్పుడూ యెల్లప్పుడూ 

నేను నిన్ను ప్రేమిస్తూనే వుంటాను. 


నువ్వు ద్వేషించినా అసహ్యించుకున్నా 

ఆ ద్వేషాన్ని అసహ్యాన్ని కూడా 

ప్రేమిస్తూనే వుంటాను.

మరణశిక్ష వేసినా దయతలచావని 

కరుణించావని మరింత ప్రేమిస్తాను.


హృదయానికి హృదయం యేమిటి

దేహాత్మలను సైతం అర్పణమిస్తాను

కాలి బూడిదై కూడా నీ పాదాలను 

సృశించి గాలిలో కలిసిపోతాను. 

ప్రేమను ప్రేమిస్తూనే వుంటాను.

                    

                     - వనజ తాతినేని


కామెంట్‌లు లేవు: