రేలపూల చెట్టును హిందీలో Amaltas (अमलतास) అని ఆంగ్లంలో Golden Shower Tree
బెంగాలీలో Sonali or Sonar అని అంటారట.
రేలపూల పై కవిత్వం ఏమైనా వుందా అని వెతికాను.
ఇదిగో అద్భుతమైన కవిత్వం దొరికింది. "Nightingale of India” పేరుగాంచిన బెంగాలీ వనిత కవయిత్రి మన తెలుగువారి కోడలు,అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.(ఉత్తర ప్రదేశ్) ఆమె రచించిన కావ్యాలలో "కాలవిహంగం" (Bird of time), "స్వర్గ ద్వారం" (the Golden Threshold), విరిగిన రెక్కలు (the broken wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి.
**************
పాలరాతి పెట్టె
కళాత్మకమైన ఈ పాలరాతి పెట్టె లాగే,
కాసియా పువ్వులా సున్నితమైన నా హృదయం ఉంది.
సున్నితమైన స్వప్నాలతో చెక్కబడి,
ఎన్నో సూక్ష్మ, అద్భుత భావనలతో తీర్చిదిద్దబడి వుంది.
అందులో నేను ఆ పరిమళాన్ని, సువాసనను పదిలపరుస్తాను
గాఢమైన, ఉద్వేగభరితమైన జ్ఞాపకాల సమ్మేళనాన్ని
దాల్చినచెక్క, చందనం, లవంగాల సువాసనలా,
పాట, దుఃఖం, జీవితం, ప్రేమ ల పరిమళాన్ని దాచుకుంటాను.
Alabaster -Sarojini Naidu
LIKE this alabaster box whose art Is frail as a cassia-flower, is my heart, Carven with delicate dreams and wrought With many a subtle and exquisite thought. Therein I treasure the spice and scent Of rich and passionate memories blent Like odours of cinnamon, sandal and clove, Of song and sorrow and life and love.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి