1, మే 2026, శుక్రవారం

రాలు పూల రాగం

 



రాలు పూల రాగం

నిండా విరిసిన పూల తరువును చూసి నా ఆశ్చర్యం రెక్కలు తొడుక్కుని పరుగులు తీస్తుంది. 

నా ఆనందం లెక్కలేనన్ని పూలలోని మకరందం వలె తూగుతుంది. 

కన్నులు జీర్ణించుకోలేని సౌందర్యం ముందు 

మనసు మోకరిల్లుతుంది 

చిన్నప్పుడెప్పుడో విన్న జావళి పెదాలపై గంతులేస్తూ పువ్వుల మూగ రహస్యాన్ని విప్పేస్తుంది 

 పూలను కోయని నాకు ప్రేమతో చెట్టు నాలుగుపూలను రాల్చి కానుక చేస్తుంది. 

అల్ప సంతోషంతో అడుగులు వేస్తాను అనంత సౌందర్యాన్ని విడిచి. 

ధూళి పై అడుగుల ముద్ర పడినట్లు వసంతం నా లోపల గాఢమైన ముద్ర వేసింది

కామెంట్‌లు లేవు: