29, ఏప్రిల్ 2026, బుధవారం

Mera kuch saaman

 ఇజాజత్ సినిమా ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ చిత్రం సుబోద్ ఘోష్ రచించిన “జాతుగృహ” అనే బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కింది. గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన సున్నితమైన ముక్కోణపు ప్రేమకథ చిత్రం. వర్తమానం ప్లాష్ బ్యాక్ ల మధ్య సినిమా నడుస్తుంది. 

సంగీతం లో రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రం ఇది. ఆశా బోస్లే యొక్క ఆత్మను కదిలించే స్వరం “మేరా కుచ్ సామాన్” కి జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ఉత్తమ సాహిత్యం అందించిన గీత రచయిత “గుల్జార్ “ కి మొదటిసారి జాతీయ అవార్డు లభించింది. 

అనూరాధ పటేల్ పై చిత్రీకరించారు. 

ఈ చిత్రంలో నాలుగు పాటలు ఆశాబోస్లే ఆలపించారు. “మేరా కుచ్ సామాన్” పాటకు కోట్లాదిమంది అభిమానులు వున్నారు. మన సమయంలో రెండు గంటల పదిహేడు నిమిషాలు ఈ సినిమా కోసం కేటాయించవచ్చు. రేఖ,నసీరుద్దీన్ షా అనూరాధ పటేల్ నటన బాగుంది. ముఖ్యంగా సుధ పాత్రలో రేఖ నటన మనసుకు హత్తుకుంటుంది. మేరా కుచ్ సామాన్ పాట సాహిత్యం మనసులను పట్టేస్తుంది. స్త్రీలు తమ మనసులో భావాలను బాధను వ్యక్తపరుచుకోవడానికి 

కవిత్వం ఉపకరిస్తుంది. గుల్జార్ కవిత్వం చాలా చాలా సున్నితమైన భావ ప్రకటన కల్గింది. ఆశా బోస్లే పాటల బోషాణంలో అమూల్యమైన నిధి. మెత్తగా మంద్రంగా మనసును కోసేస్తుంది. ఆర్ డి బర్మన్ స్వరాలు వల్ల ఈ పాటకు ప్రాణం పోసింది అంటే అతిశయోక్తి కాదు. పాట వినండీ.. వింటూనే వుంటారు. పాటల పిచ్చి ఎక్కువగా ఉన్న వారిని వదలని పాట ఇది. 116 రాత్రులు పుట్టుమచ్చ, తడి హృదయం, వెన్నెల , గోరింటాకు వాసనలు.. ఇవన్నీ ముడిపడిన ప్రేమ సున్నితమైన  వ్యక్తీకరణ మనసులను కదిలిస్తాయి.. ఇజాజత్  అంటే అనుమతి అని అర్ధం. 

********************

मेरा कुछ सामान, तुम्हारे पास पड़ा है

सावन के कुछ भीगे-भीगे दिन रखे हैं 

और मेरे एक ख़त में लिपटी रात पड़ी है

वो रात बुझा दो, मेरा वो सामान लौटा दो


Some of my things are still lying with you - 

Some drenched monsoon days,

And a night wrapped in my one of my letters

Extinguish that night, and send these things back to me 


నా  వస్తువులు కొన్ని నీ దగ్గర ఉన్నాయి.

కొన్ని వర్షాకాలపు  తడి రోజులు  నీ దగ్గర ఉన్నాయి.

మరియు నా ఉత్తరాలలో ఒకదానిలో చుట్టబడిన ఒక రాత్రి.

ఆ రాత్రిని ఆర్పేసి, నా వస్తువులను తిరిగి ఇచ్చేయ్.


पतझड़ है कुछ, है ना?

पतझड़ में कुछ पत्तों के गिरने की आहट

कानों में एक बार पहन के लौटाई थी

पतझड़ की वोह शाख अभी तक काँप रही है

वो शाख गिरा दो, मेरा वो सामान लौटा दो


Remember, it was autumn....

In autumn, I gave you the sound of falling leaves, 

After trying it on as earrings.

That branch from autumn is still trembling in winds

Make that branch fall, and send these things back to me


శరదృతువు అద్భుతం, కదూ?

శరదృతువులో ఆకులు రాలే శబ్దం

ఒకప్పుడు దాన్ని చెవుల్లో పెట్టుకుని తిరిగి ఇచ్చేశాను.

ఆ శరదృతువు కొమ్మ ఇంకా వణుకుతోంది.

ఆ కొమ్మను కింద పడేయండి, నా వస్తువులు నాకు తిరిగి ఇచ్చేయండి.


एक अकेली छतरी में जब आधे-आधे भीग रहे थे 

आधे सूखे, आधे गीले, सूखा तो मैं ले आई थी

गीला मन शायद बिस्तर के पास पड़ा हो

वो भिजवा दो, मेरा वो सामान लौटा दो


Remember, once when we were both getting drenched, 

since we were sharing one umbrella...

Half the things were drenched. The things that were still dry, I brought with me

But I think I left behind my rain-soaked heart beside the bed

Send that, along with the other things I've left behind.


మేము ఒకే గొడుగు కింద సగం తడిసిపోయినప్పుడు,

సగం పొడి, సగం తడి, నేను పొడి వాటిని తెచ్చాను.

తడి హృదయం మంచం పక్కన పడి ఉండవచ్చు.

దాన్ని పంపండి, నా వస్తువులను తిరిగి ఇవ్వండి.


एक सौ सोलह चाँद की रातें, एक तुम्हारे काँधे का तिल 

गीली मेहँदी की खुशबू, झूठ-मूठ के शिकवे कुछ

झूठ-मूठ के वादे भी सब याद करा दूं

सब भिजवा दो, मेरा वो सामान लौटा दो


One hundred and sixteen nights of the moon, and that one mole on your shoulder

The scent of undried henna, and those moments of mock tantrums

Let me also remind you about all those false promises

Return everything that's mine, but still lying with you


నూట పదహారు వెన్నెల రాత్రులు, నీ భుజం మీద ఒక పుట్టుమచ్చ

తడి గోరింటాకు సువాసన, కొన్ని అబద్ధపు ఫిర్యాదులు

ఆ అబద్ధపు వాగ్దానాలన్నీ కూడా నీకు గుర్తు చేస్తాను

అన్నీ పంపించు, నా వస్తువులు తిరిగి ఇచ్చేయ్


एक इजाज़त दे दो बस, जब इनको दफ़नाऊगी 

मैं भी वहीँ सो जाऊंगी, 

मैं भी वहीँ सो जाऊंगी 


Just grant me this one wish, that when I bury these things,

I will also breathe my last


నాకు అనుమతి ఇవ్వండి, నేను వాళ్ళని పాతిపెట్టినప్పుడు

నేను కూడా అక్కడే పడుకుంటాను,

నేను కూడా అక్కడే పడుకుంటాను


………….(*)……………….




కామెంట్‌లు లేవు: