ఈ ఉదయం completely నా మిత్రులకు అంకితం.. ఈ పోస్ట్. ముఖాన తిట్టలేక.. ఇలా! ఈ విషయంతో సంబంధం లేని వారు లైట్ తీసుకోండి. పోనీ చదివారా! ఈ జ్ఞానగుళికల్లో ఏదో మీరూ ఏరుకోవచ్చు. 😊👍
********
ఇతరులు మనకు చేసే హాని కన్నా మనకు మనం చేసుకునే హాని యెక్కువ.
ఎవరో ఏదో అంటూంటారు అని మానసికంగా ఇబ్బంది పడతుంటారు.
లేదా ఎదుటి వారు మోసం చేసారని మోసపోయామని బాధపడతారు.
ఇతరుల తప్పు ఎంతుందో మన తప్పు కూడా కొంత వుండనిదే ఏమీ ఏవీ జరగవు. పోనీ..జరిగినాయా.. తట్టుకోవాలి. చతికిలపడకూడదు. శక్తి ఉడిగి ముదుసలి అయి పరుగులు తీయలేకపోవచ్చు కానీ నడవగలరు, లేదా ప్రాకగలరు. అంతంత చదువులు చదివి వుంటారు. వేలమందికి బోధించి వుంటారు. చేతిలో యేదో ఒక సృజన వుంటుంది. అయినా.. యేదో కోల్పోయినట్టు వుండటం బాగుండదు.
జీవితం యేమి నేర్పింది!? మీరు యేమి నేర్చుకున్నారు!? కడుపున పుట్టిన బిడ్డలే ద్రోహం దగా చేస్తున్న కాలంలో కుడి చెయ్యికి యెడమచెయ్యికి ద్రోహం చేస్తున్న కాలంలో
యెవరో మోసం చేసారనో అవమానించారనో బాధపడటం మన లోపాలను మనమే బయటపడేసుకుంటూ ఆప్తులను దూరం చేసుకోవడం యెందుకు?
తత్వశాస్త్రం చదవడం మొదలుపెట్టండి. లేదా నాలుగు కథలు చదవండీ. వేటి మీద ఆసక్తి లేకుండా యే పని పై శ్రద్ధ లేకుండా జీవితాల్లో అద్భుతాలు జరగవు.
ఆలోచనలంత వృధా ప్రయత్నం వేరొకటి లేదు. 77 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని చూడండి. ఎలా కష్టపడుతున్నారో! మనం కీ బోర్డ్ పై నాలుగు పేరాలు రాయడానికి బాధపడి పోతాం. అనవసర దుఃఖాలు మోస్తూ.. కాలం బలవంతంగా అరగదీయడం.
తెలుగు సాహిత్యం అనువాదానికి నోచుకోక ఏడుస్తుంది. ఆంగ్ల సాహిత్యం యూరోపియన్ కవిత్వం అర్థం చేసుకోలేని విద్యార్థులు వున్నారు. ఆన్ లైన్ పాఠాలు చెప్పవచ్చు. పోసుకోలు కబుర్లు అతి తక్కువ జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలవు. మనుషులు వారి ప్రభావాలు చైతన్యం ఇవ్వాలి. బాధను మిగల్చకూడదు. మనం ఇతరులను బాధ పెట్టకూడదు. ఇతరులకు నువ్వు యేమి ఇచ్చావో అదే వస్తుంది. గుర్తు పెట్టుకోండి.
నన్ను చూడండి, తెల్లవారుజామున లేచి నాలుగు కథలు చదువుకున్నాను. నా ఆనందం కోసమే! తర్వాత ఇది రాస్తున్నాను.
ZEE5 లో కొరియన్ సీరీస్ “మదర్” చూడమని చెప్పాను, అన్నా కరెనినా నవల చదవండి. కానీ అన్నా లాగా ఆత్మ హత్య చేసుకోవద్దు అని చెప్పాను. అమృత సంతానం, ఆ వెన్నెల రాత్రులు నవలలు చదవమని చెప్పాను. ఒక్కరు కూడా చదివామని చూసామని చెప్పలేదు. కనీసం ఒక కథ చదవమని సూచిస్తే చదవలేరు. ఒక్క కవిత చదవలేరు. మేం గీసుకున్న గీతల్లోనుండి బయటకు రాలేము. కానీ..
మా జీవితాల్లో అద్భుతాలు మాత్రం జరగాలి అంటారు.
హే.. పోండి. మీతో స్నేహం చేస్తే.. నా మైండ్ ఖరాబు అవుతుంది. మా ప్రకాశం బ్యారేజ్ వరకూ వెళ్లి కాసిని చిల్లర నాణాలు నదిలో వదిలినట్టు మిమ్మల్ని వొదిలేస్తాను. పీడా పోద్ది. ఎక్కువకాలం toxic people ని నేను మోయలేను.
కనీసం స్త్రీ మిత్రులు అయినా “దారులేసిన అక్షరాలు“ చదవండి. అది చదివాక కూడా.. మీ ఏడుపుగొట్టు మాటలు చేతలు స్థితి మారకపోతే.. అది మీ ఖర్మ.
ఎవరూ ఏమీ చేయలేరు. మీ సొద వ్యథ నేనూ వినలేను. నా గుండె కూడా అనేక రకాలు మోయలేకపోతుంది.
ఎవరికి యెవరు యీ లోకంలో ..
ఎవరో వస్తారని యేదో చేస్తారని..
రెండు పాటలు అయినా వినండీ.
కనీసం.. మీ ఆలోచనలు అయినా లిపిబద్దం చేయండి. నేనిప్పుడు అదే చేశాను.
PS: ఈ పోస్ట్ నా దగ్గర మిత్రులను ఉద్దేశించి రాసింది. మీరు లైట్ గా తీసుకోండి. వాళ్ళు సీరియస్ గానే తీసుకుంటారు. నాకు తెలుసు. ఈ మాత్రం dose సరిపోతుందని నేను అనుకుంటున్నాను. 😊👍😘
Phone చేస్తే పీక నొక్కుతా! 😊😘
#వనజతాతినేని
#vanajatatineni
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి