2, ఏప్రిల్ 2026, గురువారం

పూల వనానికి…

 



పూల వనానికి..  -వనజ తాతినేని 

పూల వనానికి ఒంటరిగా పోకు. 

పూల సౌందర్యాన్ని సౌరభాన్ని 

రంగులను చూసి కేరింతలు కొట్టే 

నీ ఉత్సాహాన్ని పంచుకునేందుకు 

ఓ మనిషిని తోడు చేసుకో.


మథువును ఆస్వాదించి 

ఆ రుచిని చెప్పిన సీతాకోకచిలుకల

మధుపాల మాటలను విని

ఆ ఆశ్చర్యాన్ని విప్పి చెప్పడానికి

ఓ  శ్రోతని వెంటబెట్టుకుని వెళ్ళు. 


నింగి నేల మారుతం ఎలాగూ 

వుండేవే! వీలైతే.. 

సన్న చినుకులు పడుతున్నప్పుడు 

లోన ఏదో అగ్ని రాజుకుంటున్నప్పుడు

మనసైన మనిషిని నీ పక్కన వుండనీయ్.


ఒంటరిగా వెళ్ళినా తిరిగి వచ్చాక

నీ అనుభూతిని అనుభవాన్ని 

ఏ రాతిబండల పైనో ఆరేయకుండా

పరవశంతో పంచుకునేందుకు 

ఓ హృదయాన్ని కట్టి పెట్టుకో.. 


                    - వనజ తాతినేని.


02 April 2026. 07:05 am



కామెంట్‌లు లేవు: