మూడు దశాబ్దాలుగా కవిత్వం ఆమెకు సహచరిగా వుంది. తన ముందు తరం వెనుక తరం మధ్య వారధిగా నిలబడి శతాబ్దాల మూగ వేదన ను కవన రూపం లో విప్పి చూపించారు. మొదట ఆమె “కవితా సమాహారం” అనే బ్లాగ్ ద్వారా పరిచయం.అక్కడ ఆమె కవిత్వం పరివ్యాప్తం అయ్యాయి. తర్వాత రెండు మూడేళ్ళకు ఫేస్ బుక్ లో మంచి కవిత్వం వ్రాసే వారిలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాహానికి పూర్వం ఆమె కడప ఆకాశవాణి యువవాణి కార్యక్రమం ద్వారా వాసంతి గా పరిచయం. సాహితీ ప్రపంచం ఆమెకు కొత్తేమి కాదు. వస్తువు ఏదైనా ఆమె హృదయంలో లలితమై చలనమై ఆలోచనలో జ్వలనమై జాగృతమై ఆమెకంటూ ఒక ప్రత్యేక ముద్రగా అలరిస్తుంది.
సహ రచయిత, కవి గురించి పరిచయం చేసే అవకాశం వచ్చింది. సారంగ పత్రిక లో “మెరాజ్ ఫాతిమా” కవి పరిచయం చేసాను. చదవడానికి సమయం లేనివారు .. ఈ పరిచయాన్ని వినే సౌలభ్యం వుంది. కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా.. లేదా వీడియో పై నొక్కి పరిచయం వినవచ్చు. మిత్రులకు ధన్యవాదాలు 🙏

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి