ప్రతి కథ కవిత వ్యక్తిగతాలు కావు. లోకానుభవాలు, కల్పితాలు కావచ్చు.
మనసు దారంతో పతంగాన్ని యెగరవేసినట్టు..
ఏం బాధలండీ ..బాబూ ! కంటి మీదకి కునుకే రాదు.. కథో , కవితో అయ్యిందాకా మనసు తేలికా పడదు .
పేరు పక్కన రచయిత,కవి అని నమోదు కావాలంటే " ప్రపంచమంతా నిద్ర పోతుంటే మేల్కోవాలి. ప్రపంచం తన గురించి చేయని ఆలోచన చేయాలి, ప్రపంచం నుండి తనని తానూ వెలివేసుకోవాలి, ఎన్ని ఎదల బరువునో మోయాలి. మోసి మోసి కునారిల్లిపోవాలి". అదంతే ! ఎవరి కోసం వాళ్ళు వ్రాసుకుంటున్నామంటే అది ఆత్మవంచన. ఎవరికోసం వాళ్ళు వ్రాసుకోవాలంటే డైరీ చాలు. మనసు కవి ఆత్రేయ గారన్నట్టు .. రచయిత బాగా వ్రాయగల్గితే పాఠకులకి బాధ. బాగా వ్రాయలేకపోతే రచయితకి బాధ.
అనుభవం మనది కాకపోయినా.. వినడం చూడటం ద్వారా .. మనకు ఒక పాఠం నేర్చుకున్నట్టుగా వుంటుంది. #lifelessons అవి.
ఒక కథ, లేదా కవిత్వం రాద్దాము అని కూర్చుంటే విషయం మనది కాకపోయినా.. అందులోకి మన అనుభూతి లేదా మన అనుభవాలో వచ్చి ఆటోమేటిక్ గా వచ్చి కూర్చుంటాయి. అందువల్ల దానికి ఇంకా బరువు పెరుగుతుంది. స్త్రీల వేదనలు బరువైనవి! ఏ స్త్రీ చదివినా బాధపడతారు. అది సహానుభూతి మాత్రమే! జాలి కరుణ తర్వాత సంగతి.
దారం నా చేతిలో ఉంది దీపం నా చేతిలోనే వుండి.. అయినా.. నువ్వెటో తప్పిపోయావు
అంటాను.. ఒక కవితలో నేను.
ప్రతి కవిత, కథ.. రాసినవారివి అయివుండవు. నేనెప్పుడూ చెపుతాను.. అన్ని కథలు అన్ని జీవితాలు.. రచయిత కు కవికి వుండవు. అలాగని తన అనుభవంలోకి రాని విషయాన్ని కవి,రచయిత అంత గాఢంగా రాయలేరు. ఎవరో వుంటారు ప్రతిభావంతులు. ప్రతిభను కూడా చూడండి.
మా ఫ్రెండ్ మొదటిసారి ఒక కథ రాసారు అంట. అందులో స్త్రీ.. గుంటూరు నుండి విజయవాడ కి నడిచి వచ్చారంట.ఆ కథ ప్రచురితం అయ్యాక.. ఆమెను పరిచితులు బంధువులు అందరూ.. మీరు గుంటూరు లో ఎప్పుడు వున్నారు? అని అడిగారంట. అలా వుంటుంది పాఠక పరిచితులతో.
అన్నట్టు.. నిజంగా జరిగిన విషయం.. ఒకటి వుంది. నా ఫ్రెండ్ భర్త అర్ధరాత్రి తాగి వచ్చి ఆమె వద్దనున్న పసిబిడ్డను లాక్కొని.. రోడ్డు మీదకు నెట్టేస్తే.. ఎవరి ఆశ్రయం పొందాలో తెలియక.. చేతిలో చిల్లిగవ్వ లేక..దుఃఖంతో అయోమయస్థితిలో.. రైల్వే ట్రాక్ వెంట నడుస్తూ.. నడుస్తూ తెనాలి చేరుకుంది.
అలా వుంటాయి.. జీవిత దుఃఖాలు.
రాయకుండా ఉండనీయని దుఃఖాలు.
మీరేమి అనుకున్నా.. నేను రాయకుండా వుండను. ఆ కథలో కవితలో.. నేను వున్నానేమో అని భూతద్దంతో వెతుకున్నా సరే!
ఆ మాట.. ఇన్ బాక్స్ లోకి వచ్చి నన్ను అడగవద్దు.. ప్లీజ్! 🙏🤔😢
జీవితమంటే మార్పు,
జీవితమంటే సంచలనం
జీవితమంటే పయనం
దీనికి ఎవరూ బెదరకూడదు
పారిపోకూడదు -రావి శాస్త్రి
#lifegriefs
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి