సిరివెన్నెల శోభ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సిరివెన్నెల శోభ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, నవంబర్ 2018, మంగళవారం

విదిలించరాదా విభో నీ విబూది

ఓం నమః శివాయ 




సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు శివదర్పణం అనే కావ్యం రచించారని చదివాను. యూ ట్యూబ్ లో వారు స్వయంగా ఆలపించిన గీతం కూడా చూసి .. ఆ సాహిత్యాన్ని వారి గళంలోనే వింటూ వ్రాసుకున్నాను. ఇది బ్లాగ్ లో ప్రచురించడం ద్వారా ఇంకొంతమందిని చేరే అవకాశం ఉంటుంది కదా అనే వుద్దేశ్యంతోనే.  భక్తి భావంతో అర్పించిన సుమాక్షరాలలో  ఆర్తి నెలకొనివుంది. ఆ దేవదేవుడిని వేడుకునే  ఈ గీతం అందరిని అలరిస్తుందన్న నమ్మకం.  


శివదర్పణం లో  సిరివెన్నెల  


విదిలించరాదా విభో నీ విబూది 

విడిపించరాదా విరాగి విపత్తి 

వినిపించలేదా విలాపించు వినతి 

విసుగైనరాదా విరించన విరోధీ 


ఇసుక రేణువుపాటి విసిరితే తరిగేనా 

రసశేవిధీ  నీ వరవార్నిధీ 

దశదిశాళికి చాటి విశదీకరించనా 

గిరిజాపతీ నీ కరుణాకృతీ  

నిరుపేదవైపోవు నడివీధి పడిపోవు || ని || 

కరిగేది కాదు కాణాచి కించిత్ పంచి 

పొందరాదా విపులకీర్తి 

వెలిగించరాదా కృపా కిరణ జ్యోతి 

కలిగించరాదా కపర్దీ విముక్తి 

తొలగించరాదా విషాదా నిశీధీ 

కనిపించలేదా ప్రభో ఈ కబోది  || వి || 


గిరిని పెకిలించేటి  పెంకితనమే 

ప్రీతి కల్గించెనా నన్ను కదిలించెనా 

పెనుగులాడు కిరీటి సింగాణి శిరమంటి 

మురిపించెనా నిను కరిగించెనా 

నాకేవి పదితలలు, లేవు గాండీవములు || నా || 

దయ చూపమంటు కైమోడ్చి యేడ్చె భక్తి 

పనికిరాదా మౌనమూర్తీ... 

వికటించె నాథా వివాదాల వితతి

విషమించెకాదా విషాదార్చి వ్యాప్తి 

వీక్షించరాదా విరూపాక్ష నా..గతి 

వినిపించలేదా శివా నాడు ఆర్తి 


విదిలించరాదా విభో నీ విబూది ||వి||  

విడిపించరాదా విరాగి విపత్తి 

వినిపించలేదా విలాపించు వినతి 

విసుగైనరాదా విరించన విరోధీ ||వి|| 

     



27, అక్టోబర్ 2017, శుక్రవారం

మరుగేల మబ్బు ముసుగేల

నాకిష్టమైనపాట


ముగ్గురి హృదయాల సున్నితమైన  అలజడి అద్భుతమైన బాణి  సుతిమెత్తగా కోసేస్తుంది. ప్రతిరోజూ విన్నా .. విసుగువేయని పాట. "అల్లుడు గారొచ్చారు " చిత్రంలో "హరిహరన్ " పాడినపాట. 

ఇదే చిత్రంలో .. “రంగు రంగురెక్కల సీతాకోక చిలుక” కీరవాణి గారి పాట కూడా చాలా బాగుంటుంది. 


పాట సాహిత్యం :


మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమామా ఓ చందమామా

మనసున మల్లెలు విరిసిన వేళ

మమతల పల్లవి పలికిన వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

ఓ చందమా..మా ఓ చందమా..మా


కాంచన కాంతుల కాంచన బాట కనపడలేదా

కొమ్మన కూసిన కోయిల పాట వినపడలేదా

ఉలి తాకిన శిల మాదిరి ఉలికులికి పడుతోంది ఎదలో సడి

చలి చాటున మరుమల్లెకి మారాకు పుడుతోందో ఏమో మరి

చెంతకు చేరే సుముహుర్తాన ఆశలు తీరే ఆనందాన

మౌనమే మోహన రాగమయే వేళ


మరుగేల మబ్బు ముసుగేల



మాటకు అందని ఊసులు లేవా చూపులలోనా

చూపులు చేరని సీమలు లేవా ఊహలలోనా

కనుచూపులో చిగురాశలు బరువైన రెప్పల్లో బంధించకు

మది వీధిలో స్వప్నాలకి సంకెళ్ళు వేసేటి జంకెందుకు

ఊయలలూపే మృదుభావాలు ఊపిరి తీగను మీటే వేళ

మౌనమే మోహన రాగమయే వేళ

మరుగేల మబ్బు ముసుగేల

మరుగేల మబ్బు ముసుగేల


మనం చూసే వీడియో పాటకి వినే ఆడియో పాటకి తేడా ఉంటుంది . 

చరణాలు అటుదిటు  మారిపోయి ఉంటాయి.


ఈ పాటకు మా నాన్న గారి అవార్డ్ లభించింది అని కీరవాణి గారు "స్వరాభిషేకం " కార్యక్రమంలో చెప్పారు . శ్రోతలకు వీనులువిందు చేసినపాట  కీరవాణి గళంలో కూడా వినడం బాగుంటుంది. మరకతమణి కీరవాణి గారి స్వరకల్పన అంటే నాకు చాలా ఇష్టం . ఏ పాటకు ఆ పాటే బాగుంటుంది. కీరవాణి గారి పాటల్లో కొన్ని నాసిరకం పాటలు కూడా ఉన్నాయేమో .. ఆ పాటలను వెదికి వినడం కూడా నాకు సరదానే కానీ .. పాటలన్నింటిలో 90% సాహిత్యపరంగా సంగీతపరంగా ఆకట్టుకున్నవే !

ఆ పాటలన్నింటిలోనూ నాకు చాలా ఇష్టమైన పాట యిది.






16, జూన్ 2016, గురువారం

పండుగ అంటే ..సిరివెన్నెల మాట - పాట


తెలుగు సినీ సాహిత్యంలో గొప్ప సాహిత్యం అందించిన వారిలో "సిరివెన్నెల" గారిది ప్రత్యేక శైలి


ఒక పాటని విని ..ఆ పాట లో భావాన్ని అర్ధం చేసుకుంటే...కొంతైనా మానసిక వికాసం కలుగుతుంది.


"'పదుగురి సౌఖ్యం కోరే దినమే పండుగ కాదా ? అని రుద్రవీణ చిత్రం లో పాటలో చెప్పినా..

"పదుగురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైనా పెంచలేని ఎడారి కాదా? అని అల్లుడుగారు చిత్రంలో పాటలో చెప్పినా..


మనిషి తత్వం మనసు తనం కనబడాలంటే..మన ఆలోచనా విధానం లో మార్పు రావాలని చెపుతూ..


పాటైనా సరే సాంఘిక ప్రయోజనం ని ఆశిస్తూ..ఆలోచింప జేయాలనే ఆకాంక్షతో.. సిరివెన్నెల గారు వ్రాసిన పాటలు అన్ని మేలేన్నిక కలవే!


కొండంత భావాన్ని గుప్పెడు పదాలలో గుప్పించి వ్రాయడం బహుశా వారికే సాటి ఏమో!


నేను ఎప్పుడో ఎక్కడో చదివిన ..వాక్యాలు గుర్తుకు వస్తున్నాయి.


"మనమెంత  ఎత్తుకు వెళితే మనచూపు  అంత  విశాలమవుతుంది.

 మన చూపు ఎంత విశాలమయితే మన భావన అంత బలంగా ఉంటుంది

భావనలు ఎంత బలంగా ఉంటే వ్యక్తీకరణ అంత స్పష్టంగా ఉంటుంది

వ్యక్తీకరణలో  స్పష్టత ఏర్పడిన కొలదీ  రచయితకి  సమాజానికీ  అంతరంగిక బంధం మరింత బలీయమవుతుంది 

 వ్యక్తుల ఆచరణ పరస్పర ప్రేరక మవుతుంది."


ఖచ్చితంగా ..సిరివెన్నెల గారి పాటలు చూసినప్పుడు నాకు పై వాక్యాలు కి సరిపోతుంది అనుకుంటాను.


ఇక్కడ ఒక విషయం చెప్పదలచాను.


సిరివెన్నెల గారి భావ సంపద ఎంత ఘనమైనదో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు


వారి ప్రతి..మాట, ప్రతి పాట విన్న,చూసిన శ్రోతకి హృదయానికి హత్తుకుని పోతాయి.


ఒక సందర్భాన్ని వారు చెప్పిన కోణంలో మనం చూడటం నేర్చుకుంటే.. మన లో బూజు పట్టిన భావాలు అన్ని దులిపి పారేసుకున్నట్లే!


ఇటీవల సిరివెన్నెల గారిని, వారి తనయుడు ని ఆతిధులుగా పిలిచి "ఈ టి వి " వారు" జీన్స్" అనే గేం షో నిర్వహించారు.


ఆ కార్యక్రమంలో ..సిరివెన్నెల గారిని ఒక పాట పాడమని కోరారు.


అప్పుడు వారు పాడిన పాట..


పండుగ అంటే ..


ఏమిటో వారి పాటలో చూడండి.


పండుగ అంటే ఫలానా రోజంటే ..

తక్కిన రోజులు అన్ని బరువుగా మోసున్నామంతే


బంధువు లెవరంటే ఫలానా వాళ్ళంటే

పక్కనే ఎందరు ఉన్నా ఒంటరి వాళ్ళం అయినట్టే


పంచాంగం చెపితేగాని పండుగ రానందా?

మంచి ముహూర్తం కాదని గుండెల సవ్వడి ఆగిందా


ఆకురాలే కొమ్మల కోసం ఆమని వస్తుంది

ఆశలు రాని మనసుంటే ప్రతి రోజు అలాంటిది


పెదవులపై నవ్వులు పూస్తే అదే చిత్రమవుతుంది

మది ముంగిట ముగ్గులు వేసే శాంతి పేరే సంక్రాతి


ప్రత్యేకంగా బంధువులు వచ్చే రోజు ఒకటి ఉంటుందా?

చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా?


ఒకటి రెండంటూ విడిగా లెక్కడితే

తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడు

అంకెలు ఎన్నంటే పక్కన నిలబెడుతూ

కలుపుకు పోతుంటే లేక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే


నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే

కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే


నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే

ప్రపంచ జనాభా మొత్తం కలిపితే

మనిషి తనం ఒకటే ..మనిషి తనం ఒకటే!


ఈ పాటలో కొంత భాగం "చక్రం" చిత్రం ..లో రంగేళీ హోలీ హంగామా కేళీ ..అనే పాటలో చూడవచ్చు.


9, జులై 2011, శనివారం

తెల్లారింది.. లేగండో..సిరివెన్నెల సాహిత్యం,గళం




తెల్లారింది  లేగండో ..

పాట  సాహిత్యం :

తెల్లారింది.. లేగండో .. కొక్కొరో కో..
మంచాలింక  దిగండో..కొక్కొరో కో..
పాములాంటి చీకటి  పడగ  దించి పోయింది
భయం లేదు   ఒయం లేదు నిదుర ముసుగు తీయండి.
చావులాటి  సీకటి  చూరు దాటి పోయింది
.భయం లేదు ఒయం లేదు చాపలు చుట్టేయండి.
ముడుసుకున్న రెక్కలిప్పి పిట్ట  చెట్టు ఇడిసింది
మూసుకున్న రెక్క లిరిసి  చూపులెగారనీయండి... (తెల్లారింది)

చురుకు తగ్గిపోయింది చందురుడి కంటికి
చులకనై పోయింది లోకం చీకటికి (చు)
కునుకు వచ్చి తూలిందా చల్లబడ్డ  దీపం
ఎనక రెచ్చిపోయింది  అల్లుకున్న పాపం
మసకబారి పోయిందా చూసే కన్ను
ముసురుకో దాకా మైకం మన్ను మిన్ను
కాలం కట్టిన గంతలు తీసి
కాంతులు ఎల్లువ  గంతులు వేసి..(తెల్లారింది)

ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుపెట్టి  చూసిందా సూరీడు చూపుల బాణం
 కాలి బూదిధైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో  నిలబడుతుంద చిక్కని పాపాల నీడ

చెమట బొట్టు చమురుగా సూరెడుని  వెలిగిద్దాం
వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గి పూలు పూయిద్దాం(చెమట)
వేకువ చెట్టుల కత్తులు  దూసి
రేతిరి మంచును ముద్దలు చేసి  (తెల్లారింది)
ఇది సిరివెన్నెల సాహిత్యం,గళం..రెండూ.. కలిపి..ఒక పాట.

కళ్ళు లేని వారికే కాదు..కళ్ళు ఉన్నవారికి.. కూడా.. ఓ..వెలుగుపూల బాట.
కళ్ళు chiత్రానికి..ఈ..పాట ను వ్రాసారు. జానపద గీతం లా అనిపిస్తుంది. ఎస్.పి.బాలసుబ్ర మణ్యం గారు..ఈ చిత్రానికి..సంగీతం అందించారు.1988 లో..ఈ చిత్రం వచ్చింది.

సిరివెన్నెల గురించి తెలియడానికి ఈ పాట సాహిత్యం ఒక్కటి చాలు.అంతకు ముందు సిరివెన్నెల గురించి తెలిసిన వారికి ఇప్పుడు వారిపై.. ఈ పాట విన్నాక మరింత అభిమానం పెరుగుతుంధి సాహిత్యపరంగా ఈ పాట చాలా గొప్ప పాట సాహిత్యం వింటూ లిరిక్స్ వ్రాసుకున్నాను.వివరణమరొకసారి.

  

10, జూన్ 2011, శుక్రవారం

ఋణం తీర్చుతరుణం వస్తే



నాకు.. చాల..ఇష్టమైన పాట...కే.బాలచందర్ అపూర్వ  సృష్టి.. "రుద్రవీణ" చిత్రం...లో..పాట

ఒక మనిషిని..మార్చడానికి.. సంవత్సరాలు.. పట్టవు..ఒక..చిన్న సంఘటన చాలు..లేదా..ఓ..పాట ..ఓ..మాట చాలు.  

పిల్లలకి.. లోకం పోకడ తెలియని స్వచ్చమైన మనసు ఉన్నప్పుడు.. పడిన ముద్ర.. వారిని..జీవితంలో..చాలా ప్రభావాలకి..గురిచేస్తుంది. పిల్లల మనసు.. మనం నట్టింట్లో..కట్టే పాలవెల్లి.. అందులో.. మనం ఏం పెడతామో..అవే.. ఇంటికి వెచ్చిన నలుగురికి..కన్పిస్తాయి.  పిల్లల మనసులో..నాటుకున్న భావాలు అంతే..! 


రుద్రవీణ చిత్రం ప్రారంభమే..చాంధస  సంస్కృతి సంప్రదాయాల  పై  మానవత వాదం ఎక్కుపెట్టిన విల్లంబు.  "చుట్టుపక్కల చూడరా చిన్నవాడా.".అనే  పాట ద్వారానే.. బాలచందర్.. చిత్రం మొత్తం సూక్ష్మాతి సూక్ష్మం గా చెప్పేశారు.. "మానవ సేవే..మాధవసేవ " అన్నది మరచి.. సంప్రదాయం పేరిట మనుషులని..అంటరానివారిని చేసి.. కష్టాలు  ఎదురైనా స్పందించక గిరిగీసుకుని కూర్చుని.. చోద్యం చూసే కరకు గుండెల కసాయి తనం.. మారక తప్పదని..ఒక వాస్తవాన్ని.. ఎంత హృద్యంగా.. బాలచందర్ చిత్రీకరించారు.



 మన చుట్టూ  ..ఉన్న సమాజాన్ని చూసి మన వంతు  కర్తవ్యంగా..   ఏమైనా చేయవలసి వస్తే.. చెయ్యకుండా.. ఎస్కేప్ అయ్యే మనుషులు..కోకొల్లలు.. వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే..అన్న అలసత్వ ధోరణి  వల్ల.. ఇచ్చి-పుచ్చుకునే మనస్తత్వం కొరవ  అయి..  తాము మాత్రం అందలం ఎక్కాలనుకుంటారు. 

సమాజ శ్రేయస్సు కాంక్షించని.. ఎంత గొప్ప సంప్రదాయమైనా  అది అల్పమైనదే !   

ఈ విషయాన్నీ "సిరివెన్నెల"  ఈ పాటలో ఎంత గొప్పగా.. వ్యక్తీకరించారో  ..! 

విశ్వ మానవ శ్రేయస్సుని కాంక్షించని.. ఏ కళ యినా..కళాకారుడైనా.. మనసు లేని  మట్టి ముద్దలు.. ప్రాణం లేని..శిలలు..

ఒక బాలుడి  మనసులో.. శత  కోటి   ప్రశ్నలు  ..ఉధయింప జేసి  .. సమాజములో మార్పుకి,  మనుగడకి..ప్రాణం పోసిన పాట.. చాలా..స్పూర్తికరమైన  పాట.  ఈ..పాట..ప్రభావం..అనంతం. అందుకే....నేను.. మనీషి గా.. కాకపోయినా.. మనిషిగా..ఉన్నాను.. భాద్యత గల పౌరురాలుని అని..చెప్పడం.. కూడా..అందుకే.. మనిషిగా..స్పందించడం.. చేతనైన సాయం చేయడం ..నా కర్తవ్యం.. అనుకుంటూ.. దేవుడి గుడికి..వెళ్ళినప్పుడు..ఎంత భక్తితో..ఉంటానో  .. సమాజమనే..అనే దేవాలయం లోను..అంత..భక్తిగా..ఉండాలన్నది..నా.. ఈ..  సమాలోచన తో..ఈ పాట..పంచుకుంటూ..  సమాజమనే సముద్రపు  ఒడ్డున .. ఓ.. ఆలోచనా కెరటం ...  సిరివెన్నెల..అక్షర ఉద్దీపనం.       


చుట్టూ పక్కల చూడరా చినవాడ 
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ  - 2
కళ్ళ ముందు కటిక నిజం కనలేని గుడ్డి జపం 
సహించదు ఆ పరమార్దం బ్రతుకుని కానీయకు వ్యర్దం  - 2
చుట్టూ పక్కల చూడరా చినవాడ 
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 

స్వర్గాలని అందుకొనాలని వడిగా గుడి మెట్లు ఎక్కేవు   
సాటి మనిచి వేదన చూస్తూ జాలి లేని శిలవినావు 
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే 
గుండె బండగ మార్చేదా సాంప్రధాయమంటే   
చుట్టూ పక్కల చూడరా చినవాడ 
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది 
గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే వలచింది 
ఋణం తీర్చుతరుణం వస్తే తప్పించుకుపోతున్నావా 
తెప్ప తగలపెట్టేస్తావ యేరు దాటగానే 
చుట్టూ పక్కల చూడరా చినవాడ  
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 
కళ్ళ ముందు కటిక నిజం కనలేని గుడ్డి జపం 
సహించదు ఆ పరమార్దం..బ్రతుకుని కానీయకు వ్యర్దం 
చుట్టూ పక్కల చూడరా చినవాడ  
చుక్కలో చూపు చిక్కుకున్నవాడ 

30, డిసెంబర్ 2010, గురువారం

కావ్య పఠనం మేలు

 సిరివెన్నెల  సాహిత్యం లో  లోతులు చూడటం  నేర్చుకుంటే మనిషిగా  మనం  ఎలా  ఉండాలో తేలికగా తెలిసిపోతుంది.
 గురు శుశ్రూష చేసి జ్ఞానం ఆర్జించక్కరలేదు. పురాణ ఇతిహాసాలు  చదవక్కరలేదు..
 పుస్తకాలకి అంకితమవసరం లేదు అని.. ఒక వేదికపై ఒక సెలబ్రిటి చెపుతుంటే విని అవునా! అని ఆశ్చర్వం కల్గి   దీర్ఘంగా ఆలోచించడం వారు వ్రాసిన పాటలని అదే పనిగా వినడం అలావాటు చేసుకుని సెలబ్రిటి చెప్పిన మాటకి వ్యతిరేకంగా చేయడం మొదలెట్టాను. అంటే.. కావ్య పఠనం మొదలెట్టాను. ఎందుకంటే అందులో మాధుర్యం   చెపితే అర్ధం కాదు. కావ్యామృతం  సేవించాలన్నమాట. కొన్నాళ్ళకి  కి అది మానేసాను. ఎందుకంటే.. నాకు అవి అర్ధం కాలేదు కాబట్టి. మళ్ళీ.. పాటలే వినడం  శరణ్యం.
 మా ఇల్లు ధ్వని కాలుష్యంతో నిండిపోయేది. ఇంట్లో వాళ్ళందరికీ   చెవుల్లో.. దూదులు   పెట్టేసి వాళ్ళని విననందుకు దురదృష్ట వంతుల్ని  చేసేసి  నేను పాటల పిచ్చి దానిగా ముద్ర వేయించుకుని మరీ సాధించిన సముపార్జునం  అండీ.. ఇది కనీసం నలుగురుతో పంచుకోని బ్రతుకు ఎందుకు చెప్పండి?  అందుకే ఇలా..
సరే.. సిరివెన్నెల  గురించి   చెప్పడం  కంటే వింటే మంచిది.  ఒక సమగ్ర సాహిత్యనిధిని పరిచయం చేయక్కరలేదు కదా. ఇప్పుడు ఒక పాట.  నాకు నచ్చిన  వారి రచనలలో ఒక నూలుపోగు ని నేను (అందరికి) పరిచయమార్పణమస్తు  అని సాహితి  పూర్ణ చంద్రుడికి  వందనాలు అర్పిస్తూ కీర్తిస్తూ ఆయన కలం అపురూపంగా కీర్తించిన అపురూపమైన ఆడజన్మ గురించి, ఆ పాట గురించి..
 ఎమ్.ఎమ్.కీరవాణి.. స్వరకల్పనలో గాన గంధర్వుడు.. కే.జే.ఏసుదాస్  గళ మాధుర్యంతో   "ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి" తర్వాత అంత  స్థాయిలో వచ్చి అందరి నోళ్ళలో నలిగిన పాట.
 కార్యేషు దాసీ కరణేషు మంత్రీ..
భోజ్యేషు మాతా శయనేషు రంభ..

అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకి ప్రతిరూపం ఇల్లాలమ్మ(అపు)
మగ వాడి బ్రతుకులో సగపాలు తనదిగా..
జీవితం అంకితం చేయగా (అపు)
పసుపు తాడు ఒకటే మహా భాగ్యమై
బ్రతుకుంది పడతి పతే లోకమై
మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా యే  ఆప్తులు..
ఏ  పూజ చేసినా యే నోము నోచినా
ఏ స్వార్ధం లేని త్యాగం భార్యగా చూపదా ముందుగా..(అపు)
కలిమి లేములన్ని ఒకేతీరుగా
కలసి పంచుకోదా  సదా తోడుగా
కలిసిరాని కాలం  వేలేవేసినా 
 విడిచి పోనీ బంధం తనై ఉండదా
సహ ధర్మచారిణే  సరిలేని వరమని..
సత్యాన్ని కనలేనినాడు మోడుగా మిగలడా పురుషుడు (అపు)
భార్యని వీడిన  మగవాడికి వీపున చెళ్ళున చరచినట్లు లేదూ !  ఇంతి ఇంతికి  ఒక కథ.  ఎంత పంచుకున్నా అది  తరగని వ్యధ. అందుకే.. మాటలతో చెప్పలేక పై చిత్రం తో నా ఆవేదన వెల్లడిస్తున్నా.
 ఈ పాట ఎవరికైనా ఇష్టం అంటే.. నాకు కోపం. ఇంత మొత్తుకోవాలా ఇంకానా! స్త్రీ విలువ ఇంకా తెలియదా అని బాధ.
సిరివెన్నెల గారు ఇంకోటి కూడా చేరిస్తే ఇంకా బాగుండేది. ఆమాట "క్షమయా ధరిత్రి" అని
సహోదరులలరా! కోపం తెచ్చుకోకండి.  నిజం తెలుసుకోండి. ఇది విన్నపం.
గతంలో ఇలా.. చెప్పినప్పుడు  సోదరులకి కోపం వచ్చింది. అందుకే ముందస్తు విన్నపం అన్నమాట.
దేనికైనా పారదర్శకత  ఉండాలి కదా. మాటైనా పాటైనా ప్రవర్తనకైనా. అందుకే విని పిసరంత వాస్తవంలో ఉందామని.. నా తపన. అంతే!
ఈ పాట చిత్రంలో సందర్భోచిత గీతంగా వుంటుంది. వాస్తవిక ప్రపంచంలో స్త్రీ పురుషులిరివురిలో సహనవంతులు సేవాభావం భాద్యత కరుణ కల్గినవారున్నారు. కాకపొతే స్త్రీ పిసరంత ఎక్కువ. వారిని ఇంకా అలాగే ఉండాలని భావించడం కూడా అత్యాస కదా ! స్త్రీ అయినా పురుషుడైనా పవిత్రబందాన్ని  పవిత్రబంధం గానే భావిస్తే గుదిబండల్లాంటి  బ్రతుకులుండవు  కదా.!
ఈ  పాట గురించిన  మాట చూసినందులకు ధన్యవాదములు

7, డిసెంబర్ 2010, మంగళవారం

వాక్యం రసాత్మకం కావ్యం సిరివెన్నెల పాటకి వర్తిస్తుంది

Posted by Picasa తెలుగు సినీ వినీలాకాశంలో  సాహిత్యపు పూర్ణచంద్రుడు..

సిరివెన్నెల .. వారి కలం  జాలువార్చిన ఎన్ని మణి మాణిక్యాలో నాకు  చాలా.. ఇష్టం.

నన్ను.. అమితంగా ప్రభావితం చేసిన ఆయన పాటలు.. నేను విననట్లు  అయితే నాకు సాహిత్యంపై మక్కువ కలిగేదే..కాదు.  "వాక్యం రసాత్మకం కావ్యం " అన్నారు.. విశ్వనాథ వారు.  ఆ మాట సిరివెన్నెలకి.. వర్తిస్తుంది.. పదాల గాఢత,  అల్లిక.. భావ ప్రకటన, ఎవరు అనుకరించలేని వైవిద్యభరితమైన  సాహితి స్రష్ట .. ఆయన పాట వింటూనే.. ఈ పాట.. సిరివెన్నెల.. సాహిత్యం .. అని.. చెప్పుకునే.. అద్వితీయమైన  ముద్ర.. వారిది..  నాకు బాగా నచ్చిన పాటలలో ఒకటి రుద్రవీణలో  "నమ్మకు నమ్మకు ఈ రేయిని.."  ఆ పాటని ఆ సాహిత్యపు విలువల్ని ఇష్టపడని వారు ఉండరేమో..


 పాట.. వినోదాన్ని  పంచి  గాలి అలలపై.. తేలియాడించడమే కాదు.. ఆలోచింపజేస్తుంది కూడా..  చిత్ర కదాపరంగా  సందేశం నిండి ఉండాల్సిన  అవసరం ఉన్నాఅప్పుడే కాదు తర్వాతెప్పుడు విన్నా విన్న ప్రతి సారి  శ్రోతని ఆలోచింపజేసే పాట ఎప్పుడు విన్నా క్రొత్తగా అనిపించే ఇళయరాజా.. సంగీతం, నా అభిమాన నటుడు చిరంజీవి గారి నటన,బాలు గళం లోని ఒంపులు  వెరసి.. ఈ పాట.. అందరి  నోటా పలకాల్సిందే! చిరస్థాయిగ మిగిలే పాట ఇది    ఈ తెలుగు పాట చైతన్య పరిచే కావ్య గీతిక.రేడియో లో మరీ మరీ కోరి వేయించుకుని విన్న పాట, క్యేసేట్ అరిగి టేపు తెగిపోయే దాకా విన్న పాట, తర్వాత CD లలో పదే  పదే  ప్లే చేసుకుని విన్నపాట ఇప్పుడు యూ ట్యూబ్ లో ఎక్కువగా చూసే పాట ఇది . ఆ చెట్టు చుట్టూ కట్టిన చప్టాపై  చిరంజీవి వేసే స్టెప్స్(02:57 సెకన్స్ దగ్గరనుండి)  చూడండి ఎంత బావుంటాయో ! 
అలాగే ఈ  పాట  సాహిత్యం  చూడండి..


సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు సీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి
ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి
పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోని
రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటెనక

నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి
కలలే వలగా విసిరే చీకట్లను

వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు
రవికిరణం కనబడితే తెలియును తేడాలన్ని

ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయి రాదోయి నీవైపు మరువకు


శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా
ఆనాడు వాసంత  గీతాలూ పలుకును కద
గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినిని
సగసని సని దనిదమదమ దనిదమపగ

 ఒక పాటలో ఇంత సందేశాన్ని ఇవ్వడం సామాన్య మైన విషయం కాదు. పామరుడుకి కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఉండే  సాహిత్యం. నిజానికి చిత్రంలో సూర్యం (సూర్యనారాయణ మూర్తి) పామురులతో కలిసి మెలిసి పోయి మంచిని బోధించే పాత్ర కాబట్టి ఇక్కడ అలాంటి సాహిత్యమే అవసరం అని కె. బాలచందర్ అనే  స్రష్ట కి తెలుసు కదా !  పాటకి  వివరణ కూడా అంతగా అవసరం లేని పాట.   అందుకే ఈ పాట మేటి పాట.ఈ లింక్ లో వెంటనే ఈ పాటని  వినాలనిపిస్తుంది .అందుకే వెళుతున్నాను.  మీరూ  వినండి. రండి.. కలసి విందాం చూద్దాం .