ఈ పాట ఈ టీవీ సీరియల్ "కళంకిత" లో ఉన్న పాట.
ఈ పాట సాహిత్యం "సుమన్"
సంగీతం :సాలూరి వాసూ రావు
పాడినవారు :ఎస్ :జానకి
చక్కని అర్ధమున్న పాట ఇది. అందుకే నాకు ఇష్టమైంది .
సన్మతినీయవే భారతీ
సన్మతినీయవే భారతీ
జగతిని వెలిగించు నీతి నియతుల నిర్మల జ్యోతి
జగతిని వెలిగించు నీతి నియతుల నిర్మల జ్యోతి
కళారంగానికేల ఈర్ష్యల దుర్గతి
కళారంగానికేల ఈర్ష్యల దుర్గతి
కల్మషాలని హరించవే సకల కళల ఆకృతీ
కల్మషాలని హరించవే సకల కళల ఆకృతీ
సన్మతినీయవే భారతీ
అన్ని కళల పరమార్ధం అమేయానందమే
అన్ని కళల పరమార్ధం అమేయానందమే
కళలన్నీ కోరేది నీ సన్నిధానమే
కళలన్నీ కోరేది నీ సన్నిధానమే
ధ్యేయం ఒకటే కదా ఈర్శ్యాగ్నులు ఎందుకు?
ధ్యేయం ఒకటే కదా ఈర్శ్యాగ్నులు ఎందుకు?
మార్గం ఒకటే మదమత్సరాలు ఎందుకు?
మార్గం ఒకటే మదమత్సరాలు ఎందుకు?
సన్మతినీయవే భారతీ
సన్మతినీయవే భారతీ
నాట్యశాస్త్రంలో ఆ నాగరాజుకెంత పరిణితి
నాట్యశాస్త్రంలో ఆ నాగరాజుకెంత పరిణితి
అయినా గళమున గరళంతో విషజీవిగానే విఖ్యాతి
అయినా గళమున గరళంతో విషజీవిగానే విఖ్యాతి
కమ్మగా సాగే గీతాన్ని ఆపేయదా చిన్న అపశృతి
కమ్మగా సాగే గీతాన్ని ఆపేయదా చిన్న అపశృతి
అసూయ అంటని కళకి అసమానం కదా ప్రగతి
అసూయ అంటని కళకి అసమానం కదా ప్రగతి
సన్మతినీయవే భారతీ
సన్మతినీయవే భారతీ
జగతిని వెలిగించు నీతి నియతుల నిర్మల జ్యోతి
కళారంగానికేల ఈర్ష్యల దుర్గతి
కల్మషాలని హరించవే సకల కళల ఆకృతి
కల్మషాలని హరించవే సకల కళల ఆకృతి
సన్మతినీయవే భారతీ
సన్మతినీయవే భారతీ భారతి.. భారతీ....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి