దాశరధి గారి మొదటి కవితా సంపుటి "అగ్నిధార"
ఆధునికాంధ్ర సాహితీ చరిత్రలో.. దాశరధి గారిది ఒక ప్రత్యేక అధ్యాయం.ఆయన తెలంగాణలో పుట్టడం మూలంగా..భారత స్వాతంత్ర్య పోరాటంలో..ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేకపోయిందని.. చెపుతారు.దాశరధి అటు భారతావని మొత్తం స్వాతంత్ర్య సమర శంఖం పూరిస్తుంటే.. తెలంగాణం లో..ఆ ప్రాంత విముక్తి కొరకు పోరాడవలసి వచ్చినదంటే ..నిజాం పరపీడన వల్ల ప్రజలు ఎన్ని ఇక్కట్ల పాల్బడ్డారో !
దాశరధి తెలుగు దేశంలో ఒక భాగమైన తెలంగాణా స్వాతంత్రోద్యమానికి శంఖం పూరించారు. ఆ ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్ట నష్టములకి గురి అయ్యారు. జైల్లోను,ఉద్యమంలోను.. బాధతో..కవితావేశంలో.. ఆయన వేలువరించిన ఎన్నో కవితా ఖండికలను..మనం దృష్టిలోకి..తీసుకున్నా అందులో..ప్రధానమైనది.."అగ్నిధార"
తెలంగాణా విముక్తి పోరాటంలో తెలుగువారల సమరగీతం దాశరధి లో..ప్రస్పుటంగా కానవస్తుంది.ఆయన ప్రజా కవి. ప్రేక్షకుని వలె కాకుండా ప్రజల కష్టనష్టాలలో ..తానోకడిగా కలసిపోయి ఉద్యమ వీరుడిగా "పెన్'' అనే ''గన్" పట్టి..గళం అనే బుల్లెట్ లు వెలువరించి..ప్రజా శక్తులతో కలసి జనంలో కవితావేశాన్ని కల్పించి కార్య రంగంలో..దూకించారు.
నిజం పాలనలో విసిగి పోయిన తెలంగాణా ప్రజల ఆవేశం,ఆకాంక్షలన్నీ..దాశరధి కవిత్వంలో..ప్రతిబింబించాయి..రజాకార్ల దుండగాలతో ..ఆస్తుల దోపిడీలతో..గృహదహనాలతో ,స్త్రీల మాన అపహరణ లతో.. మారణ దారుణ కాండ కి అట్టుడికి పోయిన కాలంలో.. దాశరధి ఆగ్రహావేశంతో..
ఓ..నిజాం పిశాచమా!కానరాడు
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని
తీగెలని తెంపి ,అగ్నిలో దింపినావు
నా తెలంగాణా కోటి రతనాల వీణ
తర తరాల స్వప్నాల సుందర ఫలమ్ము
స్వైర భారత భూమి చూపెడెనో లేదో
విషం గుప్పించినాడు నొప్పించినాడు
మా నిజం నవాబు జన్మజన్మాలబూజు
అచట పాపము దౌర్జన్య మావరించి
తెలుగుదేశాన నెత్తురుల్ చిలికి
మత పిశాచం పేదల కుతుక నమిలి
ఉమ్మివేసెను పిప్పి లోకమ్ము మీద
నా తెలంగాణా కోటి రతనాల వీణ
తీవియలు తెగి విరిగి నదించ కుండే
నా తెలుగు జాణ ప్రాణమానాలు దోచి
ఈ నిజం పిశాచి కన్నెర్ర చేసే..
ఇలా.. సాగింది..అగ్నిధార . సమర గీతమై నిలిచింది.నిజాం ..ప్రభుత్వం ఊరుకుంటుందా ? ఇనుపగొలుసులతో బంధించి ఓరుగల్లు నగర వీధుల్లో..నడిపించింది. నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్భందించింది. అగ్ని ప్రజ్వరిల్ల కుండా ఆపడం ఎవరి తరం? విప్లవ కవిత్వాన్ని జైలు గోడల మీద శిలాక్షరాలుగా లిఖించాడు..దాశరధి.
ఆయన ప్రభావంతో..ఎందరో..ఉద్యమంలోకి దుమికి పనిచేసారు.
ఆయన ప్రభావంతో..ఎందరో..ఉద్యమంలోకి దుమికి పనిచేసారు.
తెలంగాణా స్వాతంత్రోద్యమ కవిత ..దాశరధి గళంలో.. పద్య,కావ్య రూపాలలో సాగినా.. ప్రజలు మెచ్చినది..అగ్నిధార..మాత్రమే !
దాశరధి కి కన్నతల్లి అంటే యెంత ఇష్టమో..తెలంగాణ మంటే అంత ఇష్టం..ఆమెని వేనోల్ కీర్తించి.. తన "రుద్రవీణ" ని ఆమెకి అంకితం చేసాడు.
చివరకు నిజాం ప్రభువు..హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో..విలీనం చేసిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..సమైక్యంలోనే అర్ధం ఉందని తలచి.. సమైక్య భావనకి..నడుం బిగించి.. విశాలాంధ్ర సమైక్యత కోసం పద్యాలు వ్రాసారు. ..
తుంగభద్రానదీ భంగమ్ములిరుక్రేనా
లోరసిపారుచు రుచు లరయు చుండ
కృష్ణ వేణీ తరంగిణీ నాలుకలుచాచి
దారుల రెండిట "మజా"లరయుచుండ
గోదావరీ వీచికా దివ్యహస్త మ్ము
లిరుకేలన్కుల మన్ను తరచు చుండ
కోటి కిన్నెరసాని మాటి మాటికి పొంగి
రెండు వైపులా దరు లోడంగోనగా
ఇటునటును తెల్గు నేల లారటంనోంది
కలసి పోబో జూచున్న యట్టులనే దోచు
కలిమివేయుము న తెలంగాణ తల్లి
మూడుకోట్లునోక్కనే ముడి బిగించి ..
నా కోర్కె దీర్చుమమ్మా!
నీవు మదీయశ్రు కణ వినిర్మితమాలా
నీక మ్ము సమర్పించెద
గాక ,విశాలాంద్ర మనేడి కల నిజమగుతన్ .. అని నదుల నిలా సమైక్య సూత్రంగా వాడారు.
ఇలా ప్రాంతం కొరకు,విశాలాంద్రం కొరకు....ఆయన కలం నర్థించినది.
పునర్నవం,ఆలోచనాలోచనాలు,తిమిరంలో సమరం.. ఇలా కావ్య సృష్టి సాగింది.
ఎవడైనా మానవుడే-ఎందుకు ద్వేషించడాలు? రాక్షసి నైనా మైత్రికి రానిత్తును భయం లేదు!
హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభించదు -ఉదయం వినా నా కంటికి ఏ వస్తువు రుచించదు
గతాన్ని కాదనలేను ,వర్తమానం వద్దనబోను ,భవిష్యత్ ఒదులుకోను ..కలం నా కంట మాల .. నా పేరు ప్రజా కోటి -నా వూరు ప్రజా వాటి ..అంటారు.
బాంబులలో బలం చచ్చి -పాములలో విషం చచ్చి
ప్రేమములో బలం హెచ్చి -స్నేహంలో శక్తి హెచ్చి
చిన్న పాటి అంకుశామున-గున్న ఏనుగును వంచే
కొత్తరకం పడ్డాయి కనుగోన్నాను రండో !..అంటూ.. ఆయన పథం ని మనకి చూపారు.
తిమిరంతో ఘన సమరం -జరిపిన బ్రతుకే అమరం
కవితా తేజోవలయం-అవని శాంతికి అది నిలయం ..అని చెప్పారు. సందర్భాలు వేరువేరుల్లో.
కమ్మని నా తెలంగాణ ..తొమ్మిది జిల్లాలేనా ?
బహు లాంధ్రకు తెలంగాణ పర్యాయ పదం కాదా....అన్నారు. వేర్పాటు వాదాలు ని ఆయన మందలించారు.
ఒక్క తెలుగు -ఒక్క వెలుగు..అని నినదించారు.
తల్లీ!నిను ముక్కలోనరించ దలచు వారి
ఆశ అది ఆశలైయున్న అవసరాన
నీ పదమ్ము ల్ల పై తల మోపి నేడు
చించు చుంటి ఆనందాశ్రు బిన్దువులును..
.
నవంబర్ ఒకటి..మనమంతా ఒకటి ..
సూర్య చంద్రులున్నంత వరకు తెలుగు జాతి ఏక సూత్రం పై నిలవాలని ఆయన ఆకాంక్ష.
కుడి కంటిని ఎడమ కన్ను పొడిచేనా ?
కుడి చేతిని ఎడమ చేయి నరికేనా ?
ఒక దేహం-ఒక గేహం మరిచావా ?
ఒక్క తెలుగు ఒక్క వెలుగు మరిచావా?
విడిపోవుట -చెడిపోవుట
విడిపోవుట -పడిపోవుట
కలసియుంట గెలుచుకుంట
తెలుగు విలువ తెలుసుకునుట !
గుండెను రెండుగా చీల్చు మొండితనం పనికి రాదు
మనుషులని ఏకం చేసే మంచితనం కావాలి....
ఇది.. ఆయన భావన.
ఈనాటి స్వార్ద కుటిల రాజకీయ నాయకుల పన్నాగాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా రుద్ది.. ప్రాంతాల పేరిట.వెనకబాటు తనం పేరిట వేరు కుంపట్లు పెట్టి విధ్వంసాలు సృష్టించే.. నాయకులు.. ఆంద్ర ప్రాంతం వారిని నిజాం ప్రభువులతో పోల్చి.. తెలంగాణ వాదంతో..అవమాన పరస్తున్నారు. అసలు తెలంగాణ ప్రజల వెనకబాటుతనం ఎందుకు ఉందో.. ఆలోచిస్తూ.. ప్రజల కవి.. వాస్తవ దృక్పధం కల్గిన సమరశీలి దాశరధి..ని ఒకసరి పరికించి చూస్తే.. తెలుగు వారిగా వారు ఏం కోరుకున్నారో అర్ధం అవుతుంది.తెలుగు దేశాన్ని..ఇంతగా ప్రేమించిన కవి దార్శకనీయత..ఏమిటో..అర్ధం కావాలని..ఒక చిన్ని ఆశతో.. ఈ..వ్యాసం.
ఆకాశవాణి విజయవాడ "ఏ" కేంద్రంలో (2004 జూలై ఇరవైరెండు న) సాహితీ కార్యక్రమంలో.. ప్రసారం అయిన .. నా ప్రసంగ వ్యాసాన్ని కుదించి..ఈ పోస్ట్..
దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు. ఆ బాకు అజ్ఞాన తిమిరాన్ని..చీల్చి చెండాడాలని.. .. ముకుళిత హస్తములతో..నా అభిమాన కవి..కి..పాదాభి వందనాలతో..
6 కామెంట్లు:
మీ నుండి ఇలాంటి మెసెజ్ చూసి, సంతోషంగా ఉంది.
ధన్యవాదములు
చాలా బావుంది. ఆయనకి తగినంత గుర్తింపు రాలేదు, విశ్వనాథ మరణం తరవాత రాష్ట్ర ఆస్థాన కవిగా ఒక పదివిచ్చారనుకోండి. కానీ ఆయన కవిత్వానికి జరగవలసినంత ప్రచారం జరగలేదు.
ముందుగా ఈ రాష్ట్రంలో సగ భాగమైన తెలంగాణ విముక్తికై ఉద్యమించి, జైలు పాలయి, లాఠీ దెబ్బలు అవమానాలు అనుభవించి, ఆ తరువాత ఏ మహాంధ్రోదయాన్ని ఆకాంక్షించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కొరకు కలంతో, గళంతో పోరాడాడో, ఆ మహాకవికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయక .. చేయక .. చేసిన సత్కారం - జీవితాంతం ఆస్థాన కవిగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వు. ఆ అల్ప సంతోషి ఎంతో పులకించిపోయాడు. కానీ ఆ ఉత్తర్వులోని అంశాలను కూడా విస్మరించి, అర్ధంతరంగా ఆ పదవిని ఊడబీకి, ఆ మహాకవిని .. ఆ మహా దేశ భక్తుని తీవ్రంగా అవమానించింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదా? ఆ అవమానాన్ని జీర్ణించుకోలేక, ఆ మనోవ్యథ తోనే ఆ మహాకవి మరణించిన విషయం వాస్తవం కాదా? ఆ తరువాత ఆయనను ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఈ సమైక్యాంధ్ర వాదులు గాని ఒక్క రోజైనా తలచుకొన్నారా? ఈ రోజు ఉద్యమ నేపథ్యంలో .. పాపం .. వీళ్ళకి దాశరథి తెగ గుర్తుకు వస్తున్నాడు.
మీరూ రస హృదయం తో దాశరధిగారిని ఇష్టపడి రాసిన టపా కి
వేరే రంగు పూసి మిమ్మల్ని పొగిడారో, తెగిడారో తెలియని కామెంట్లు వస్తే చూస్కోండి.
జై మానవ జాతి !!
అజ్ఞాత గారికి.. మీ స్పందనకి ధన్యవాదములు. దాశరధి గారికి అవమానం జరిగిందని భావించిన తరుణం లో.. ఆ ప్రభుత్వ భాగస్వామ్యంలో.. ఈ నాటి తెలంగాణా వాదులు ఉన్నారు. అప్పుడు వారు చోద్యం చూసారా? కవులకి రాజాశ్రయం ఎప్పుడు లభించలేదు.అవమానాలు తప్ప ఏం మిగలవు..అని మనకి చరిత్ర చెబుతుంది. ప్రజల ఆకాంక్షలని ఎవరు అణచజాలరు. నేను దాశరధి కవితా హృదయాన్ని మాత్రమే...చెప్పాను. ఈ పోస్ట్ కి.. వేరే రంగులు లేవు ani గమనించగలరు. స్వార్ధ రాజకీయలు లేని ప్రజా ఉద్యమాలకి..నేను సానుకూలంగా స్పందించ గలను. అది మనిషి మనిషి తత్వం..మానవత్వం. దానికి.. ఏ కొన్ని ప్రాంతాలో చిరునామా కాదు. ధన్యవాదములు.
v gd info...
i lyk it..
కామెంట్‌ను పోస్ట్ చేయండి