పువ్వులు,పసిపాపల నవ్వులు,దయార్ద్ర నగవులు ,సేవానిరతి ధగ ధగలు..ఇవి చూడగానే ఒక.. మహనీయ రూపం మన కనుల సాక్షాత్కారం... ఆమె.. "విశ్వ మాత".. విశ్వమంతా.. తానే అయిన .. "ప్రేమ ప్రదాత".
పచ్చని పందిరిలో..టన్నులకొద్దీ పూలని అలంకరించి..ఆడంబరాన్ని ప్రదర్శించి...తెల్లారక ముందే.. చెత్త కుండీల పాల్జేసినప్పుడు ..
ఆకలి కేకలు వినబడని మర్యాదస్తుల హంగామాల మద్య పదార్ధాలని.. నేల పాలుజేస్తున్నప్పుడు..
నిత్యం .. గాంధీ ఇజం జపం చేస్తూ.. కుష్టు వ్యాధి గ్రస్తుడిని వ్హూసి ఆమడ దూరం పారిపోతున్నప్పుడు..
పువ్వులని నేలరాసినట్లు పద ఘట్టనల క్రింద అమ్మాయిల నవ్వులని నలిపేసే కర్కశ హృదయాలని.. చూసినప్పుడు..
కరుణశ్రీ.. పుష్పవిలాపం,విశ్వ మాత..కరుణ గుర్తురాక మానవు. ఆ రెండూ ..చెవికెక్కని పాషాణ హృదయాలు మనవి.
విశ్వ మాతా!!
నీ కరుణ గంగ పావనగంగ కి సమాతరంగా ప్రవహించి..నీ ప్రేమామృతాన్ని ..విశ్వమంతా పంచాలన్నట్లు..కడలి ఒడికి చేరింది...
ఆర్తులకు,అన్నార్తులకు,రోగ గ్రస్తులకు..నీవు అందించిన సేవలకు పులకించి భరత మాత అత్యున్నత కీర్తి కిరీటాన్ని నీకు అలంకరించి..తన సిగలో.. మల్లికగా మార్చుకుంది.
విశ్వ మాతా.. !!
నీ సేవా ముద్ర "సింధువు"..అందలి.. ఓ ' ప్రేమామృత బింధువు.. అయినా ..ఈ జాతికి..స్పూర్తినిచ్చే ఓ' శ్వాస కావాలి.
కృత్రిమంగా కట్టిన అంతస్తుల కుడ్యములు పగుల గొట్టి అంతరాలు మరచి..విజ్ఞాన చక్షువులు తెరుచుకుని .. నవ దీప్తం కావాలి..
ఈ..నేలపైన నీ ప్రేమాన్విత సేవా పరిమళం..ఫరిడవిల్లాలి.. అని.. కోరుకుంటూ ..కరుణా అంతరంగా !!..సేవా కడలి.. తరంగా..!! నీ సేవా ఘోష.. భాధా తీరాన బధిరులుగా నిదిరిస్తున్న..ఈ జాతి..ని.. తాకి తాకి.. మేల్కొలపదేమి..?? నేను.. నల్గురిలా..నిద్ర మేల్కొనలేదేమి? గుడ్డివారు..నడిచే త్రోవే .. నాది..!? సేవా నిరతి లో..నా..అలక్ష్యానికి.. చింతిస్తూ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి