ఇదిగో... పొద్దు ప్రొద్దునే కొంచెం బద్ధకం వదిలించుకుని ఇలా ఈ ప్రపంచం యెలా వుందో చూద్దామని అంతర్జాలం లోకి తొంగి చూసాను.
చాలా రోజులయింది. కొంచెం విభిన్నంగా ఆలోచించి మనసులో విషయం వ్రాసి కూడా ! అయినా నేనమంత గొప్పదాన్ని!? అని.
విభిన్నంగా ఆలోచించడానికి వ్రాయడానికి ఒకరికి చెప్పడానికి !?
"ఐ యాం ఎ కామన్ వుమెన్"
చాలా రోజులయింది. కొంచెం విభిన్నంగా ఆలోచించి మనసులో విషయం వ్రాసి కూడా ! అయినా నేనమంత గొప్పదాన్ని!? అని.
విభిన్నంగా ఆలోచించడానికి వ్రాయడానికి ఒకరికి చెప్పడానికి !?
"ఐ యాం ఎ కామన్ వుమెన్"
ఏదో చేద్దామని మొదలెట్టినా ఆరంభ శూరత్వంగా మిగిలిపోతుందేమోనని అంతర్లీనంగా భయం కూడా. పట్టుకుంటుంది. ఎవరిని నమ్మే వీలు లేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాం. ఛీ! వెధవ జీవితం అనుకున్నది. చేయగలగడం కుదిరి చావడం లేదు పైగా అడగక పోయినా జాగ్రత్తలు చెప్పేవాళ్ళు తయారుగానే ఉంటారు. విన్నట్లు నటించాలి తప్పదు.లేకపోతే పొగరు, అహంకారం ఇలాటి ముద్రలు వేసి ఒంటరి లని చేసేస్తారు అయినా ఒంటరి ప్రపంచంలో ఎంతో ఆనందం అనుకుంటూ.. "ఒంటరి" లం అయిపోయి మనం ఇలా బ్రతికేస్తున్నాం.
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న వాటిల్లో కొన్నింటిని కూడా మనం మార్చలేం.
అవి ఏమిటో మీరే చూడండి.
అంధ విశ్వాసాలకు అడ్డుకట్ట వేయలేం.
అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలలేం
అవకాశ వాద ఉద్యమాలకి చేయూత ఇవ్వలేం.
పదవీ దాహ దావానలం ని చల్లార్చలేం.
అపరిపక్వత ఆలోచనలకి బలం చేకూర్చలేం.
అవినీతి చక్రాలకి ఇరుసు కాలేం.
కానీ.. వీటన్నిటి ప్రక్కన మనం బ్రతికేస్తున్నాం. మనలో కూడా అవి ఉండవచ్చొమో కూడా.
ఏదేదో.. చేద్దామనుకుని ఏమి చేయలేక దుఃఖం కల్గుతుంది. ఆశనిహతి వల్ల దుఃఖం కల్గుతుంది అంట.
కొన్ని చేయటానికి మనస్కరించక, కొన్ని చేయటానికి దైర్యం చేయలేక ఇదిగో ఇలా బ్రతికేస్తున్నాను.
"ఎస్"
ఐ యాం ఎ కామన్ వుమెన్.
ఇప్పుడే పోన్ చేసి మా చెల్లి అక్కా ! లంచ్ మీ ఇంట్లోనే అంది. "వంట" వెంటబడి రుచికరం ని సాధించాలి.
మా అన్నయ్య నాగాలాండ్ కి ప్రయాణం కొంచెం కాదు బాగానే దిగులు రైల్వే స్టేషన్ కి వెళ్లి అన్నయ్యకి మమకారంతో జాగ్రత్తలు చెప్పి రావాలి. మా అబ్బాయి వీడియో కాల్ చేస్తే ఎలాగబ్బా! రిసీవ్ చేసుకోలేనే!? దిగులుగా అనుకుంటూ ఇదిగో ఇలా మాత్రం బ్రతికేస్తాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి