కొన్నిపాటలు వినడానికి బాగుంటాయి .. కొన్ని పాటలు చూడటానికి బాగుంటాయి.. వినడానికి చూడటానికి కూడా.. బాగుండే పాట "రావోయి చందమామ " చిత్రంలో.."స్వప్న వేణువేదోసంగీత మాలపించే"..పాట. నాకు చాలా ఇష్టమైన పాట..నా కాలర్ ట్యూన్ గా ఊరేగిన పాట.. పాటల పల్లకిలో.. ఊరేగిన పాట. అందరికి సర్వసాధారణంగా నచ్చడానికి..కావాల్సిన అర్హతులున్న పాట. .
ఈ పాటకి..గీత రచన వేటూరి. ఆ పాట సాహిత్యం .. చాలా బాగుంటుంది. విని విని.. పాట మొత్తం.. కలలో కూడా మర్చిపోను..అంత గాడంగా నాటుకుని పోయింది..పాట సాహిత్యం పై మమకారం అది. అందులో.. ఈ చిత్రం ..నా అభిమాన చిత్రం కూడా....ఈ పాట వింటుంటే.. మదిలో..యేవో..భావాలు.. మేల్కొలేపే.. నాలో...
స్వప్న వేణువేదో .. సంగీతమాలపించే
సుప్రభాత వేళ ... శుభమస్తు గాలివీచే..
జోడైనా రెండుగుండెల ఏక తాళమో..
జోరైన యవ్వనాలలో..ప్రేమ గీతమో...
లేలేత పూలబాసలు .. కాలేవా చేతిరాతలు (స్వ)
నీవీ ప్రాణం,నీవే సర్వం
నీకై చేశా వెన్నెల జాగారం (బాలు జాగారం అన్నది ఎంత బాగుంటుందో!)
ప్రేమ నేను రేయి పగలు ( భావన వ్యక్తి, రోజు లో..ఆ రెండు సగాలు)
హారాలల్లే మల్లెలు నీకోసం ( పరాకాష్ట భావం)
కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచువేళ
నిండు ఆశలు రెండు కన్నులై చూస్తే .. నే రానా ..
కాలాలే ఆగిపోయునా గానాలే మూగబోవునా... ( కలసిన రెండు హృదయాల గానాలు మూగాపోతాయా) (స్వ).
నాలో మొహం రేగే దాహం
దాచేదేప్పుడో .పిలిచే కన్నులలో..(రసజ్ఞత )
ఓడె పందెం గెలిచే బంధం ( ప్రేమికులలో..ఎవరు ఓడినా రెండో వారు గెలిచినా )
రెండు ఒకటే కలిసే జంటల్లో..
మనిషి నిండుగా మనసు తోడుగా ( మానసికమైన తోడు)
మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలి తీరం (నిజం కదా!)
వారేవా ..ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం (ఎక్సలెంట్ ఎక్స్ ప్రెషన్ )
స్వప్న వేణువేదో.. సంగీత మాలపించే .. అసలే వేణువు.. వినడమంటే తీపి కోత.. రాత మనసు దోచే మధుర గీత.
వేటూరి కలం ఒలికించిన ప్రేమ గీతం.. ఎస్ పి.బాలు,చిత్ర గళ మాదుర్యం .. తోడై ..మన కోసం
నాయికా నాయికలు.. వారి ఇద్దరి మద్య ఉన్నదీ ప్రేమ లేక ఆకర్షణ అన్నది తేల్చుకోవడానికి..పరీక్ష పెట్టుకుని.. దూరం జరిగి.. ఒకరి ఊహలలో...ఒకరు జీవిస్తూ.. పాటలో..జీవిస్తూ..అతను.. పాటతో ప్రాణం లేచొచ్చి..ఆమె..ని చుట్టేసిన భావ తరంగం ఈ పాట...
కధకి..అనుగుణమైన పాట. వేటూరి సాహిత్య సొబగులతో.. మణి శర్మ అందించిన స్వరాలూ.. ఘాడ సుప్తావస్థలో ఉన్నా మేలుకొలిపే..పాట. మణిశర్మకి..శాక్సోఫోన్ తో స్వరాలూ అందించిన (అజ్ఞాత)ఆ కళాకారుడికి.. హాట్స్అఫ్ఫ్..అన్నమాట. నాకు చాలా ఇష్టమైన ఈ పాటని.. మెమరి కార్డ్లో..నింపుకుని..వచ్చి మా అబ్బాయి చిరంజీవి .. నిఖిల్ చంద్ర నాకు.. పుట్టిన రోజు కానుకగా ఇస్తూ.. వినిపించిన రోజు.. నా మది పుటలలో.. మరపురాని జ్ఞాపకం. ఇక పాట చిత్రీకరణ అత్యద్భుతం ... ఈ.. పాట నాకిష్టమైన పది పాటల్లో..క్రమం...నంబర్ నాలుగు..
పాట మాత్రం ..అయిదు నక్షత్రాల మార్క్ పాట. ఈ.. పాట ఇనుస్త్రుమేంట్ మ్యూజిక్ కూడా మనసు దోచేస్తుంది. పాట చూసే ఓపిక లేకుంటే ..వినేయండీ.. ఇక్కడ ...
1 కామెంట్:
ఒకప్పుడు నన్ను మత్తులో ముంచెత్తిన పాట ఇది. చిత్రీకరణ, సంగీతం, సాహిత్యం, పాటలో కరిగిపోయిన బాలు, చిత్ర గారు అన్ని సరిపాళ్ళలో సమకూరాయి ఈ పాటకి... నాకిష్టమైన నాగార్జున కూడా ఉన్నాడు ఈ పాటలో...
ఈ పాటపరిచయం చేసిన విదానము, ఇచ్చిన వివరణ బాగున్నాయి. నాకు ఇందులో(మీ వివరణ చదివాక కూడా అర్థంకాని)lines ఇవే...
"ప్రేమ నేను రేయి పగలు; హారాలల్లే మల్లెలు నీకోసం!"
కామెంట్‌ను పోస్ట్ చేయండి