19, మే 2011, గురువారం

ధూమపానం సరే మద్యపానం

నేను నిన్న రాత్రి పదకొండు గంటల సమయం అవుతుండగా ..సరాగమాల ..తో.. రేడియోకి..గుడ్ నైట్ చెప్పేసి బయట గేటు కి.. తాళం పెట్టేసి రోడ్డువైపు యధాలాపంగా చూసాను.. ఒక మందు బాబు.. మాకు రెండిళ్ళ అవతల ఉంటారు. తూలుతూ..పడుతూ..లేస్తూ.. నడుస్తూ.. తిట్టుకుంటూ..వస్తున్నాడు..నేను టక్కున లోపలి వచ్చేసి ..తలుపు వేసుకున్నాను. నాకు..అసలు.. ఆ మందు   బాబులని చూస్తేనే భయం. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ .. తిట్టు కుంటూనో,తిడుతూనో....ఆడజన్మలు ..సిగ్గుతో..తలదించుకునేటట్లు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళని కన్నందుకు..అమ్మ ,కట్టుకున్నందుకు..భార్య ..అలాంటి తండ్రి ఉన్నందుకు పిల్లలు.. లోకం మొహం  చూడలేక తాము తప్పు చేసినట్లు తలదించుకు వెళతారు. వాళ్ళ పాటికి వాళ్ళు వెళుతూ..ఉంటారా.. ఇరుగుపొరుగు ఊరుకోరు.. "ఏమిటి రాత్రి మళ్ళీ ..మీ ఇంట్లో.. వీరంగం మొదలయింది" అంటూ సానుభూతి వాక్యాలు కురిపిస్తూనే.. లోపల లోపల నవ్వుకుంటారు. అయినా ఆ నోటికి హద్దు -అదుపు లేదు.. ఇరుగు పొరుగు..వినలేక చస్తున్నాం..కాస్త ఒక గదిలో  పెట్టి తలుపులన్న వేయండి.అంటూ..ఉచిత సలహాలు ఇస్తారు. గదిలో..పెడితే ఉంటారా? సృహలో..లేనట్లు నటిస్తూనే .. నిజజీవనంలో.. మాట్లాడలేని మాటలన్నిటిని  గుర్తుపెట్టుకుని మరీ తిడుతూ..మాట్లాడతారు. 

అడ జన్మలకి..ఎంత కష్టమో..పాపం....  పూటుగా తాగి నోరు పట్టకుండా..కూస్తున్నా.. గుడ్ల నీరు కుక్కుకుని ..వాళ్ళకి.. తిండి తినిపించడానికి..తాపత్రయపడతారు.. నాశనం అవుతున్న వాళ్ళ ఆరోగ్యం పట్ల దిగులు పడతారు...ఎంత అవమానంగా మాట్లాడినా ..సహించి ..ఏదోలే తాగి మాట్లాడాడు.. అనుకుని సర్దుకుపోతారు.  అయితే.. మా ..పక్కింటి ఆవిడ అలాటి బాపతు కాదు..  భర్త తాగి వచ్చాడో.. పొరపాటున కూడా..తలుపు తీయదు.. పిల్లలిద్దరిని ఏ.సి గదిలో పెట్టి డోర్స్ క్లోజ్ చేసి.. బయట గదిలో..తను పడుకుని .. ప్రహరి గేటుకి మాత్రం తాళం వెయ్యకుండా వదిలేస్తుంది.  భర్త రోజు తాగి   రావడం మాములే!. వచ్చి నానా యాగి చేసి.. అర్ధరాత్రి ..అందరిని లేపి.. పంచాయితి పెట్టింప చూస్తాడు.. అలా నాలుగైదు సార్లు.. అతని భార్యని .. ఇరుగుపొరుగు... "నువ్వు చేస్తుంది.. తప్పమ్మా.." అని హిత బోధలు చేసి.. అతనికి..పరోక్షంగా సపోర్ట్ చేస్తారు. .  ఇవ్వన్నీ  చూసి ఒకింత కటినత్వం అలవర్చుకుని.. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా  పట్టించుకోకుండా  ఉంటుంది.. అలాగే  దోమలు  కుడుతూ..ఆకలికి  మాడి .... ఆరుబయట పడి .. పోర్లుతుంటే పాపం చూసే వాళ్ళకి..జాలి. కానీ..ఆ ఇల్లాలు .. ఇద్దరు బిడ్డలతో.. అతని  తెచ్చిచ్చే అరకొర జీతంతో....అతని.. వ్యసనాన్ని,నిర్లక్ష్యాన్ని,భాద్యతరహిత్యాన్ని భరిస్తూ..అతని అసభ్య పదజాలాని భరిస్తూ.. ఎన్నాళ్ళు  అలా ఉంటుంది.. చెప్పండి... అలా ఉండక తప్పదు..అప్పుడైనా బుద్ధి వస్తుందేమో.. అనుకుంటాను.
   
 ఒక పది సంవత్సరాల కాలంలో.. ఎక్కడ చూసినా.. మద్యం ఏరులై  పారుతుంది అంటారు.. నేను.. స్త్రీల  దుఖం .. సముద్రంలో.. ఇంకుతుంది అంటాను నేను.  చాలీ  చాలని బతుకుల్లో.. ఎక్కువ నష్టపోయేది.. కుటుంబమే..!   .. మనని పాలించే  వారికి..బంగారు..ఖనిలు.. ఈ..త్రాగుబోతులు..గత సంవత్సరం ..సంక్షేమ కార్యక్రమాలకి  ..ప్రభుత్వం కేటాయించినది  పన్నెండువందల కోట్లు అయితే ..మద్యం అమ్మకాల షాపుల వేలం ద్వారా.. కూడబెట్టుకుంది.. పదిహేను వందల కోట్లు... సిగ్గు లేదు..ఈ..ప్రభుత్వానికి.  

అడుగడుగునా..మద్యం షాప్ లే.. ఆడవాళ్ళు..పట్టపగలే  రోడ్డు ప్రక్కన నడవటానికి.. బయపడుతున్నారు.. అలాగే రాత్రి సమయాలలో.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల వాహనాలలో..కూడా.. త్రాగి.. ప్రయాణిస్తూ.. ఉండేవారు తక్కువేమీ కాదు.. వాళ్ళు వచ్చి ఆడవారి మద్య నిలబడతారు..వాసన భరించడమే కాకుండా.. వాడు ఎలా బిహేవ్  చేసిన భరించడం..ఆడవాళ్ళ వంతు అయింది...అదేం అంటే.. తాగి ఉన్నాడులే ! పోనీయండి అంటారు. అయినా  బహిరంగ ప్రదేశాల్లో.. ధూమపానం  చేయకూడదు అని..  హెచ్చరికలు వింటూ ఉంటాము. మద్యపానం చేసి.. బస్ లు ఎక్క  వచ్చా? కూడదని..రూల్ పెట్ట కూడదా ?..అన్నాను నేను.. నా వంక వింతగా చూసారు.. నిజమే లెండి...ఆర్ టి.సి. కి..ఆదాయం  తగ్గుతుందేమో..కదా.. !? టీ.వి సీరియల్స్  లో.. తప్ప మద్యపానం ,ధూమపానం తప్పని  ఎక్కడా అంతగా.. కనపడదు.. మా అబ్బాయి ..అ హెచ్చరికలు చూసి తెగ నవ్వేవాడు.. మిలీనియం  జోక్..అనేవాడు.

ఏమైనా.. మద్యపాన నిషేధం అవసరం ఎంతైనా  ఉంది. .యువతరం  కూడా.. మద్యం మత్తులో.. తూగుతుంది.  ప్రపంచ కప్..క్రికెట్ ..పోటీలలో.. సెమి ఫైనల్స్ ,పైనల్స్ జరిగినప్పుడు.. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినాయి.. అవి కొన్నది కూడా..యువతే ..అంటే  ..నమ్మి తీరాలి...మనం . ఎక్కడ చూసినా బెట్టింగులు.. మందు పార్టీలు.. తండ్రుల తరం కన్నా కూడా పిల్లలు ఇంకా.. ఎక్కువ మత్తులోకి జోగటానికి.. అలవాటు పడుతున్నారు...  మా ప్రక్కింటి ఆవిడ  లాటి కోడలు..కావాలనుకుంటారో.. లేదా..  మాయదారి మద్యం బారిన  పడకుండా.. పిల్లలని ..కాపాడుకుంటారో!?తల్లిదండ్రుల విచక్షణకి  కి..పెద్ద పరీక్ష. 

అలాగే.. స్త్రీలందరు  కలసి.. దూబగుంట ఉద్యమాలకి..తెర తీయాలి... కదా!..అయినా.. ఊరు కి ఊరు మారిపోవడానికి ..ఇదేమన్నా.. " బాలచందర్".. సామాజికసృహాతో..తీసిన .రుద్రవీణ  సినిమా..నా? ఉద్యమాలని పట్టించుకునే.. మహానుభావులు ఎవరు?   పట్టించుకుంటే.. దానికి.. హంగులు,  రంగులు పులిమి సినిమాలు తీయడానికి.. మన టాలీవుడ్  లో..నిర్మాతలకి,దర్శకులకి..కొదవ ఏంలేదు కదా!ఒక ఉద్యమం వంద ఉద్యమాలై .. చైతన్య పరుస్తుంది..  అనుకుంటూ  .. నిద్రపోయానండీ.. కలలో..అంతా.. మద్యపానం నిషేధం జరిగినట్లు.. అందరు.. సంతోషం గా  ఉన్నట్లు.... కలలు.  ఆ కలలు  నెమరవేసుకుంటూ.. వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతున్నాను.. మా ఇంటి ఎదురుగా గ్రూప్ హవుస్  కట్టారు కొత్తగా .. అందులో.. రెండు కార్లు ఉన్న ఒకరు అద్దెకి..దిగారు.. అ కారాయనేమో.. తూలుతూ.. పడుతూ.. కారు దిగి లోపలి వెళ్ళారు.. అలా.. వెళ్ళారో..లేదో..  కింగ్ ఫిషర్ ..లేబిల్  బాక్స్ ..డోర్ డెలివరీ కి.. వచ్చి డెలివరీ బాయ్  నన్ను అడ్రస్  అడిగాడు.. నేను చెపుతున్నాను.. వాళ్ళ అబ్బాయి వచ్చి.. సంతకం చేసి బాక్స్ లోపలికి   పట్టుకుని  వెళ్ళాడు.  హతవిధీ!!  నా  కలలు  కల్ల్లలేనా?..    

ఈ పోస్ట్  కనుక  వాళ్ళలో..ఎవరైనా  చూసారా..! ఉంది..నా పని..!!!అని భయపడుతూ... భాధ పడుతూ.. "సురాపానం సదా జగతి."

3 కామెంట్‌లు:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

నిజానికి బస్సులో ప్రయాణం చేసేప్పుడు తాగిరాకూడదని రూల్ ఉంది. అలా ఎవరైనా వస్తే కండక్టర్ తో చెప్పి వారిని బౌస్సునుంచి కిందకు దింపేయవచ్చు. అయితే ఈ రూల్ ని ఎవరూ సీరియస్గా తీసుకోవడంలేదు! అది మన దౌర్భాగ్యం :-(

మీ కలలు నిజమైతే భారతదేశంలో స్త్రీజాతి ఆనందిస్తుంది! అయితే ఈ మధ్య పట్టణాల్లో స్త్రీలుకూడా మద్యపానం సేవిస్తున్నారు. ఇది ఎక్కడ ఆగుతుందో...

ఏ గవర్నమెంటు వచ్చినా మద్యాన్ని నిషేదించరు. ఎందుకంటే ఆ ధనంలేకుంటే ప్రభుత్వాన్ని నడపలేని అసమర్థులు వీళ్ళు. (ఒక్క లోక్-సత్తా పార్టి వస్తే నిషేదిస్తారేమో... అయితే లోక్-సతా పార్టి ఎప్పటికీ నెగ్గలేరు...)

అజ్ఞాత చెప్పారు...

వనజగారూ,

మీకు కంఠశోష, మాకు కంటిశోషా తప్పించి చెవికెక్కించుకునేదెవ్వరు?
ఎవరికి వారు తాగి తలంటుపోసుకున్నా పక్కవారికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే అదే పదివేలు. భలేవారే మీరు మరీ మద్యనిషేధం అంటూ చెప్పుకుపోతున్నారే... సాధ్యమేనా?

అజ్ఞాత చెప్పారు...

ధూమపానం పాసివ్ స్మోకింగ్ వల్ల నిషేధిస్తారు. వాడి మందు వాడితాగితే పక్కోడికెందుకు బాధ? ప్రభుత్వం సారా అమ్ముతుంది కాని, బీడీలు అమ్మదుగా. తాగినా/తాగకున్నా గొడవ చేస్తే, తప్పే.