20, మే 2011, శుక్రవారం

భ్రమరాంబిక ఆలయం.. తుమ్మెద ఝుంకార శబ్దం... ఒక నమ్మకం

జ్ఞాన దాన మొనర్చి ,యజ్ఞాన మెపుడున్
బాపి ,ముక్తి పదమ్మును జూపి ,మేలు
కలుగజేయు సద్గుండు డొకండె  భువిని
అతని మనసారా ద్యానింతు నవవరతము ... 

ఇది మా అమ్మ నేర్పిన  తేటగీతి పద్యం.. 

శ్రీశైల శృంగే విభుదాతిసంగే 
తులాద్రితుంగే..పి ముదావసంతం
తమర్జునం మల్లికపూర్వమేకం 
నమామి సంసారసముద్రసేతుం ... 

ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో  .. శ్రీశైల క్షేత్రంలో.. మల్లికార్జుని  దర్శనం..  యొక్క ప్రాశ్తస్యం చెపుతుంది. 
మా ఇంటిల్లపాదికి ఇష్టదైవం.. "మల్లికార్జున స్వామి "  ఆయన ని దర్శించుకోవడం.స్మరించుకోవడం .. మాకు..చాలా..చాలా  ఇష్టం.

  మా ఇంటిల్లపాదికి చాలా ముఖ్యమైన ఘట్టాలలో.. స్వామీ ఆశ్సీస్సులు  .. మాకు లభించాలని మేము  తరచు శ్రీశైలం స్వామి దర్శనం కొరకు వెళుతూ ఉంటాము.  అలా వెళ్ళినప్పుడల్లా.. స్వామికి ప్రాతః కాలం న  అభిషేకం చేయించుకోవడం  మాకు చాలా ఇష్టం కూడా..  ఈ రోజు న  ప్రాతః కాలమున అభిషేకం చేయించుకోవాలంటే.. ముందుగా.. ఆర్జిత సేవల టికెట్  ముందు రోజున తీసుకోవాలి.  'గంగా సదన్ " లో.. మల్లికార్జున స్వామి  దేవస్థానం వారి కౌంటర్ రాత్రి ఏడు గంటలకి తెరువబడుతుంది. అక్కడ స్వామి వారి అభిషేకం టికెట్ వెల 1000 రూపాయలు.. భ్రమరాంబిక అమ్మవారి కుంకుమ పూజ టికెట్ వెల 350 .. రూపాయలు. పూజా సామాగ్రి టికెట్ తో పాటు దేవస్థానం  వారే ఇస్తారు.మనకు లభించిన టికెట్ల వరుస క్రమం ప్రకారం మనకి.. స్వామి సన్నిధికి.. స్వయంగా అభిషేకం చేయటానికి.. ప్రవేశం కల్పిస్తారు. దంపతులకి..మాత్రమె ప్రవేశం .లేదా  సింగిల్  కి..ప్రవేశం ..ఉంటుంది.పురుషులు  పంచె  లేదా ఫేంట్  ధరించవచ్చు పైన మాత్రం  కండువా మాత్రమే కప్పుకోవాలి..అది నియమం. స్వామి ఆలయం కి దగ్గరలో.. సాధారణ కౌంటర్ లో.. అభిషేకం కి.. టిక్కెట్లు సమయం ప్రకారం లభిస్తాయి కాని.. 600 వెల కల ఆ ఆర్జిత సేవలు..ఉద్యయం 8 .30 తర్వాత జరుగుతాయి.. చాలా వత్తిడి ఉంటుంది.. స్వామి దర్శనంకి.. వచ్చేవారి మద్య అభిషేకం లు..అంత బాగా జరగవు.. అనేకంటే..మనకి..అసంతృప్తి ఉంటుంది. అంత దూరం వెళ్ళేది స్వామి కి అభిషేకం  చేయించుకోవడానికే కదా! 

   ఇక పోతే.. మనం అభిషేకానికి..పన్నీరు, తేనె,గంధం,త్రయంబకం,జలం..వగైరా  తీసుకు వెళ్ళవచ్చు.. కానీ మనకి.. అవి స్వామివారికి సమర్పించే సమయం లభించదు. ఒక్కొక్క సారికి నాలుగైదు జంటలని లోపలకి..పంపుతారు. అక్కడ బలవంతులదే..ఒడుపుగా ఉన్నవారిదే పై చేయి. స్వామిని స్పర్శ  దర్శనం  చేసుకోనిస్తారు. .. "శివ శివేతి శివేతి  శివేతివా .. భవ భవేతి భవేతి వా.. హర హరేతి హరేతి హరేతి వా .".అంటూ.. మల్లన్న స్పర్శ దర్శనం తర్వాత అభిషేక జలంని.. శిరస్సున  జల్లుకుని.. అమ్మ దర్శనం కి.. వెళతాము.అక్కడ అమ్మకి.. కుంకుమార్చన చేయించుకుని.. అమ్మ కరుణా ఆశీస్సులు  అందుకుని .. భ్రమరాంబిక   ఆలయం  వెనుకకి వెళ్లి.. అమ్మ వెనుక దేవాలయ గోడకి..ఖచ్చితంగా .. అమ్మవారి విగ్రహం తిన్నగా చెవి ఆనించి  వినండి.. తుమ్మెద  ఝుంకార శబ్దం వినవస్తుంది.

 మా చిన్నప్పుడు..విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆ ఝుంకార  శబ్దాన్ని రికార్డ్  చేయించుకుని వచ్చి  భక్తిరంజనిలో వినిపించేవారట,. నేను..ఆ విషయాన్ని.. మా అబ్బాయికి చెపితే.." ఊరుకోమ్మా! నాకు చెపితే చెప్పావు..ఇంకెవరికి చెప్పకు.. భక్తి ముదిరి.. ..ఇంకా ఏదో అంటారు" అన్నాడు. కానీ నాకు.. ఒక నమ్మకం.   చాలా..నిశ్శబ్దంలో.. వింటే.. తప్పక  ఆ ఝుంకారం వినబడుతుంది... కానీ అక్కడ నిశ్శభ్దమే ఉండదు. అమ్మవారి గుడిలో..సేవలు జరిపే భూసురులు మాత్రం నిజమే తల్లి.. ఝుంకార ధ్వనం వినిపిస్తుంది. "యద్భావం తద్భవతి" అని చెప్పారు.


    అన్నట్టు అమ్మ వారి కి కుడిప్రక్కన దేవగన్నేరు చెట్టు ఉంది.. ఎన్ని శతాబ్దాల నాటిదో  ..నట. దేవ గన్నేరు పుష్పాల  సౌరభం మరపురాని..ఆఘ్రాణం. నేను అలాటి సౌరభం ఎక్కడా ఆస్వాదించలేదు. కానీ..అక్కడ అమ్మకి..స్వామి సేవకే పూచిన పూలు అవి. ప్రసాదంగా లభిస్తే..భక్తి తో..కళ్ళకద్దుకుని  వాసన   చూడండి..మీకే తెలుస్తుంది.  వృద్ద మల్లికార్జున స్వామి ఆలయం, నాలుగు వందల ఏళ్ళనాటి..జువ్వి,అశ్వద్ధ ,వేప వృక్షం  ప్రసిద్ధి. అక్కడ ప్రదక్షణలు చేయడం ..చాలా మంచిది.    

శ్రీశైలం దర్శనం రెండు విధాల మేలు. ఒకటి భక్తి.. రెండోది.. ఆహ్లాదకరం. నాకు..చాల ఇష్టమైన ప్రదేశం ఇది.. ఎప్పుడైనా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను. "మల్లన్న" దర్శనం నాకు కొండంత బలం...ఉత్షాహం.. అలసినప్పుడు.. నేను రీచార్జి  చేసుకోవడానికి  శ్రీశైలం వెళ్ళిపోతాను. సాక్షి గణపతి ,పాలధార,పంచదార.శిఖరధర్శనం ,ఘటకేశ్వర స్వామి ఆలయం.పాతాళ గంగ స్నానం.. అన్ని మామూలే! కానీ.. అక్క మహాదేవి తపస్సు  చేసిన స్థలం,ఇష్ట కామేశ్వరి టెంపుల్.. చాలా కష్ట  తరం. ఈ రెండింటి గురించి    .. మరొకసారి చెపుతాను..  ఇప్పుడు.. ఈ దృశ్యాలు చూడండి.        
.   
వెనుకనుండి.. మల్లన్న ఆలయ  శిఖరం  

కృష్ణమ్మ పరవళ్ళకి ఆన కట్ట .. మన జల సంపద 

నదీ విహారానికి నౌకలు సిద్దం 
అంతా శివమయం.. పాతాళ గంగ కెళ్ళే దారిలో.. నా  కెమెరా  కళ్ళకి.. ఎంత అదృష్టం 
రోప్ వే .. ఎంత సుందర దృశ్యం   

ఆలయ ముఖ ద్వారం.. ఇలా నాలుగు ప్రక్కల గోపురాలు 

శిఖర దర్శనం ఇక్కడినుండే.. 


జలవిహారానికి వెళుతూ...


.
అమ్మ సన్నిధికి .. ముఖ మండపం.. ఆలయ గోపురం   

స్వామి ఆలయ దర్శనమే.. ప్రశాంత..తీరం   మబ్బులు ఆడుకుంటున్నాయి  స్వామి సన్నిధి చెంత      

చత్రపతికి.. అమ్మ బహుకరణ ..

శ్రీశైలం  డాం వ్యూ ..   ..
స్వామి ..ని దర్శించి .. ఆహ్లాద కర దృశ్యాలు చూసారు  కదా!! .. శివ నామాని.. యః  పటేన్నియతః సకృత్  నాస్తి మృత్యు భయం తస్య పాప రోగాది  కించన..."ఓం నమః శివాయ "  తప్పకుండా "శ్రీశైల క్షేత్రం " దర్శించండి.. స్వామి ఆశీస్సులు..మీకు లభించాలని కోరుకుంటూ..  అక్షర దోషాలు ఉంటె మన్నించండి.

4 వ్యాఖ్యలు:

Raj చెప్పారు...

బాగా చెప్పారు.. శ్రీశైల దర్శనము చేయించారు. అందులకు మీకు అభినందనలు..

durgeswara చెప్పారు...

చక్కటిభావన కలిగిఉన్నారు. ఇటువంటి భావన స్థిరపడ్డవారికే తీర్థయాత్రఫలితమిస్తుంది .
ఇక శ్రీశైలంలో స్వామి వారికంటే అమ్మ ఎత్తులో కూర్చుని ఉంటుంది . ఎందుకంటే ఎన్నో ప్రయాసలతో అలసి సొలసి వచ్చే బిడ్డలను ముందుగా పలకరించేది అమ్మే . వారినితనప్రేమామృతంతో సేదతీర్చెది కూడా అమ్మే . అందుకే మాగురువుగారు చెప్పేవారు ముందుగా అమ్మదర్శనం చేసుకోరా అని. అందుకే నేనెప్పుడు వెళ్ళినా ముందుగా అమ్మ దర్శనానికే వెళతాను .

వనజవనమాలి చెప్పారు...

రాజ్ ..గారు మీకు ధన్యవాదములు.. దుర్గేశ్వర గారు..మీకునూ మరిన్ని ధన్యవాదములు.

రాజి చెప్పారు...

శ్రీశైలం మాకు కూడా చాలా ఇష్టమైన ప్రదేశమండీ ...
మీ ఫోటోలు,జ్ఞాపకాలు చాలా బాగున్నాయి.